క్రిష్ణ మృతదేహన్ని రప్పడించడానికి కృషి..
Ens Balu
3
Visakhapatnam
2020-11-10 18:32:49
ప్రమాదవశాత్తూ దుబాయిలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విశాఖ వాసి దూబ కృష్ణ కుటుంబ సభ్యులను విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, కృష్ణ మృతదేహం స్వస్థలానికి రప్పించేలా ప్రయత్నం చేస్తానని హామీఇచ్చారు. ఇదే విషయమై విదేశీ మంత్రిత్వ శాఖ మంత్రి తో పాటు, దుబాయి లో భారత రాయబార కార్యాలయంలోని అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. సాధ్య మైనంత త్వరగా మృతదేహం వచ్చే ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. ఎవరై అదైర్య పడవద్దని, ఇలాంటి కష్టకాలంలో ఏం చేసినా మీబాధ తీరనిదని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖవాసుల కష్టాలను తీర్చడంలో తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని చెప్పారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఇలాంటి సమయంలో గుండె దిటవు చేసుకొని దైర్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలుపాల్గొన్నారు.