ఆపదలో ఆదుకున్న రెడ్ క్రాస్..
Ens Balu
2
ఎచ్చెర్ల
2020-11-10 18:43:39
రెడ్ క్రాస్ సంస్థ బాదితులకు ఎల్లప్పుడూ అండగా వుంటుందని మరోసారి నిరూపించుకుంది. శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల మండలం, డి.మత్స్యలేశం పంచాయతీ, కొత్త దిబ్బలపాలెం గ్రామంలో మంగళవారం సంభవించిన అగ్నిప్రమాదంలో 7 పురిల్లు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ విషయం గ్రామ రెడ్ క్రాస్ వాలంటీర్ ద్వారా తెలిసిన వెంటనే జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ .పి.జగన్మోహన్ రావు స్పందించి రెడ్ క్రాస్ బృందాన్ని ఎమర్జెన్సీ రిలీఫ్ కిట్లతో పంపించారు. బకెట్స్, చీరలు, పంచెలు, దుప్పట్లు, తువ్వాళ్ళు, ,వంట సామాగ్రి కిట్, దోమ తెర, టార్పాన్లు , బెడ్ షీట్స్ వి.ఆర్.ఓ బి.అప్పారావు , గ్రామ పెద్దలు బాధితులకు పంపిణీ చేశారు. రెడ్ క్రాస్ అందించిన సహాయం మరువలేమని బాధితులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సిబ్బంది జి.విజయబాబు, బి.శ్రీధర్, ఎన్.కోటేశ్వరరావు, జి.పవన్,శ్యామ్ గ్రామ పెద్దలు శ్రీరాములు, విశాలమ్మ, రామారావు గ్రామ యువత పాల్గొన్నారు.