మోదీవేవ్ తో దుబ్బాకలో బీజేపీ గెలుపు..


Ens Balu
2
పాతగాజువాక
2020-11-10 18:45:42

భారత ప్రధాని నరేంద్రమోదీపై ఉన్న నమ్మకమే తెలంగాణలో టిఆర్ఎస్ గడ్డపై బీజెపీ జెండా రెపరెపలాడిందని గాజువాక నియోజకవర్గ కన్వీనర్ కరణంరెడ్జి నరసింగరావు అన్నారు. మంగళవారం రాత్రి తెలంగాణ రాష్ట్రంలో దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్ది రగునందనరావు 1118 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా, బీహార్ లో 125 సీట్లుకు పైగా ముందంజలో వున్న సందర్బంగా పాతగాజువాక కూడలిలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు.  ఈ సందర్బంగా ఎఎన్నార్ మాట్లాడుతూ, మన ప్రదాని  మోదీ గారి నాయకత్వంపై ఉన్న నమ్మకంతో దేశ ప్రజలు బీజేపి కి పట్టం కట్టారని , రాబోయే రోజుల్లో ఆంధ్రాలో కూడా రాష్టృ అధ్యక్షులు సోము వీర్రాజ నాయకత్వంలో అధికారంలోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు. మొదట తీన్ మార్ డప్పులను వాయిస్తూ..మిఠాయిలను పంచుతూ అందరికీ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఇంద్రసేనా రెడ్డి, కృష్ణం రాజు, కో కన్వీనర్ గూటూరు శంకరరావు, కార్పొరేటర్ అభ్యర్థులు సిరసపల్లి నూకరాజు, సోంబాబు, నాగేశ్వరరావు, అప్పలరాజు, పావని, బాటాశ్రీను , మహిళా మోర్చా అధ్యక్షురాలు వర్రి లలిత, సన్యాసిరావు,అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.