యూజర్ ఛార్జీలు తప్పనిసరిగా చెల్లించాలి..


Ens Balu
5
జివిఎంసీ కార్యాలయం
2020-11-10 19:15:31

జివిఎంసి పరిధిలోని ఘన వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించాలని జివిఎంసి కమిషనర్ డాక్టరు జి. సృజన తెలిపారు. ఈ సందర్భంగా విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, సోలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలు అనుసరించి స్వచ్ఛ భారత్ మిషన్ కు అనుబంధంగా శాస్త్రీయ పద్దతిలో ఘన వ్యర్ధ నిర్వహణ అమలు చేయడానికి జివిఎంసి వివిధ రకాల పద్దతుల చేపడుతోందన్నారు. అపార్ట్మెంట్ మరియు గేటెడ్ కమ్మ్యునిటీ నుండి వచ్చు ఘన వ్యర్ధాలను ఎప్పటికప్పుడు సేకరించి, సిబ్బందితో డంపింగ్ యార్డుకు తరలిస్తున్నామన్నారు. సదరు ఘన వ్యర్ధ పదార్ధములు సేకరించడానికి వాహనములు ద్వారా తరలించుటకు అయ్యే ఖర్చును యూజర్ చార్జీల రూపంలో ఆయా గృహ సముదాయాల మరియు వాణిజ్య సంస్థల నుంచి వసూలు చేస్తామని తెలిపారు. గేటెడ్ కమ్మ్యునిటీ, అపార్ట్మెంట్స్ లోని ఒక్కొక్క ఫ్లాట్ నకు నెలకు రూ.50/- చొప్పున, హోటల్స్, రెస్టారెంట్స్ నకు నెలకు రూ. 5,000/- చొప్పున, సినిమా థియేటర్సు  నెలకు రూ.1500/- చొప్పున, మాల్స్ నకు నెలకు రూ.5,000/- చొప్పున, కళ్యాణ మండపాలకు నెలకు రూ.1,000/- చొప్పున, ఇతర వాణిజ్య సముదాయములకు నెలకుగాను రూ.1,500/- చొప్పున వసూలు చేసి తగిన రసీదును సిబ్బంది నుండి పొందాలని కమిషనర్ పేర్కొన్నారు. వినియోగ రుసుమును(యూజర్ చార్జీలను) పౌరులు, వివిధ యాజమాన్య సంస్థలు చెల్లించి, నగారాభివృద్ధికి తోడ్పడాలని ప్రజలను, యాజమాన్య సంస్థల ప్రతినిధులను కమిషనర్ పత్రికా ప్రకటన ద్వారా కోరారు.