పోలీసుగా ప్రజలతో ఎలా మెలిగామో అదే ముఖ్యం..


Ens Balu
3
Tirupati
2020-11-10 19:52:54

పోలీసులుగా మనం ఎలా పనిచేశామో అనేదికాదని, ప్రజల వద్ద మర్యాదలా ఎలా మెలిగామో అదే పోలీస్ లకు అధికారులకు గౌరవాన్ని తెచ్చిపెడుతుందని తిరుపతి అర్భన్ ఎస్పీ ఏ.రమేష్ రెడ్డి సూచించారు. మంగళవారం శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ సెనేట్ హాల్ లో జిల్లా పోలీస్ అధికారులతో నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా యస్.పి మాట్లడుతూ కేసుల పురోగతి విషయంలో పూర్తిగా మార్పు తీసుకురావాలన్నారు. కేసు విషయాలపై పూర్తిగా అవగాహన పెంచుకొని ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించి పురోగతి సాదించాలన్నారు. కేసులను పరిష్కరించే విషయంలో ఆలసత్వం వహించకూడదని, పోలీస్ విధులను క్రమశిక్షణతో సక్రమంగా నిర్వహిస్తే ఫలితం అదే వస్తుందన్న ఎస్పీ ప్రతి కేసు విషయంలోను సంబంధ పడిన వ్యక్తులతో వ్యక్తి గతంగా విచారించాలన్నారు.  కేసు జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి పూర్వపరాలను పరిశీలించినప్పుడే కేసుపై పట్టు సాధించి కేసును చేదించడానికి అవకాశం వుంటుందని వివరించారు. విచారణలో ఉన్న కేసులను, పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో  ఉన్న ఫిర్యాదు యొక్క ఫిర్యాదులను పరిశీలించి వాటిపై ప్రత్యేక శ్రద్ద తీసుకొని త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. స్టేషన్ పరిధిలో ఎక్కువ నేరాలకు తీవ్రమైననేరాలకు పాల్పడిన వారిపై సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయాలన్నారు. రౌడీ షీటర్లపై ప్రత్యేకమైన  నిఘా వుంచి ఎప్పటికప్పుడు కేడీలు, డి.సి.లు, బి.సి.లను తరువుగా చెక్ చేసి వారి కదలికపై ప్రత్యేకమైన నిఘా ఉంచాలన్నారు. అవసరమైతే బైండ్ ఓవర్ చేసుకొని క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు. దొంగతనాలు జరగకుండా ముఖ్యమైన ప్రాంతాలలో తగిన బీట్లు, పికేట్స్, లర్కింగ్ పాయింట్స్ ఏర్పాటు చేసుకొని దొంగతనాలను అరికట్టాలన్నారు. తప్పకుండా పోలీస్ సిబ్బంది విజిబుల్ గా  రోడ్డుపై కనిపించాలని తెలిపారు. స్టేషన్ కు వచ్చే ఫిర్యాదు దారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడి వారికి తగిన న్యాయం చేయాలని, మిస్సింగ్ కేసులు వచ్చిన వెంటనే త్వరిగతిగా స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొన్ని ముఖ్యమైన కేసు విషయాలలో ఇతర జిల్లాల  అధికారులతో మాట్లాడి సమన్వయంతో పరిష్కరించుకోవాలన్నారు. కార్యక్రమంలో  అడిషనల్ యస్.పి లు, అడ్మిన్  సుప్రజ మేడం , తిరుమల మునిరామయ్య గారు, యస్.బి డి.యస్.పి గంగయ్య, జిల్లాలోని డి.యస్.పి లు, సి.ఐ లు మరియు యస్.ఐ లు పాల్గొన్నారు.