ఎన్ఎస్జీతో వివిఐపీ కాన్వాయ్ పై శిక్షణ..


Ens Balu
2
Tirupati
2020-11-10 19:54:17

వివిఐపీలు, విఐపీలు, సెక్యూరిటీ కాన్వాయ్ ల సిబ్బందికి తిరుపతి అర్భన్ పోలీస్ ఆధ్వర్యంలో ఎన్ఎస్జీ ఆధ్వర్యంలో రెండురోజుల తిరుపతి వెటర్నరి కాలేజి మైదానంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం ముగింపు కార్యక్రమంలో తిరుపతి అర్భన్ ఎస్పీ ఏ.రమేష్ రెడ్డి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో 6 జిల్లాలకు చెందిన ప్రత్యేక కాన్వాయ్ సిబ్బందికి, సెక్యూరిటీ సిబ్బందికి వి.ఐ.పి, వి.వి.ఐ.పి వాహనాలను నడుపు సందర్భంలో ఏ ఏ ప్రాంతంలో వి.ఐ.పి ని తీసుకొని వెళ్ళునప్పుడు వాహనాలను ఏ రోడ్డు వస్తే ఎలా జాగ్రత్తగా నడపాలి, పబ్లిక్ ఉన్న ప్రదేశాలు, సాదారణ రోడ్డు, ఘాట్ రోడ్డు, సమస్యాత్మకమైన రోడ్డు, ఫారెస్ట్ ప్రాంతం మొదలగు ప్రాంతాలలో వాహనాలను ఎటువంటి జగ్రత్తలు తీసుకొని నడపాలి అనే దానిపై మరియు వాహనంలో వి.ఐ.పి ఉన్నప్పుడు ఏదైనా ప్రమాదం సంబవించినప్పుడు వి.ఐ.పి ని ఎలా రక్షించాలి, ఎలా రక్షణ కల్పించాలి తెసుకోవలసిన జాగ్రత్తలపై క్షుణ్ణంగా రెండు రోజుల పాటు పోలీస్ డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నారన్నారు. ఎన్ఎస్జీ, ఇంటలిజెన్స్, సెక్యూరిటీ వింగ్ ఈ శిక్షణకు ప్రాతినిధ్యం వహించారన్నారు. వి.ఐ.పి వాహనాల శ్రేణి, కూర్పులతో పాటు విపత్కర పరిస్థితులో వాహనాలను ఎలా నడపాలి అనే వాటిపై ప్రదర్శనపై కూడా శిక్షణ ఇచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో  అడిషనల్ యస్.పి సుప్రజ మేడం  ఏ.ఆర్ డి.యస్.పి నంద కిషోర్, హోంగార్డ్ డి.యస్.పి లక్ష్మణ్ కుమార్,డిఎస్పీ డి.కోటేశ్వరరావు, ఇన్స్పెక్టర్ రాజు, ఎన్ఎస్జీ యస్.ఐ జానకిరాం, యం.టి.ఓ ఆర్.ఐ రెడ్డప్ప రెడ్డి తదితరులు పాల్గొన్నారు.