కరోనా విపత్తులోనూ తప్పని బయోమెట్రిక్ అటెండెన్సు..


Ens Balu
4
East Godavari
2020-07-26 15:29:53

తూర్పుగోదావరి జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్న వేళ కూడా ప్రభుత్వ కార్యాలయాలు, వార్డు, గ్రామ సచివాలయాల్లో బయోమెట్రిక్ అటెండెన్సు విధానాన్ని కొనసాగిస్తున్నారు. కత్తిపూడి, బెండపూడి గ్రామసచివాలయాల్లోని సిబ్బందికి కరోనా సోకిన తరువాత కూడా బయోమెట్రిక్ విధాన్ని అమలు చేయడంపై జిల్లా అధికారుల పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్రభుత్వ శాఖల్లో మాత్రం సాధారణ హాజరు మాత్రమే ఉద్యోగులకు నమోదు చేస్తున్నారు. దీంతో ఎప్పుడు ఎవరికి బయోమెట్రిక్ కారణంగా కరోనా ముప్పు వస్తుందోనని జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు భయపడుతున్నారు. వివిధజిల్లా శాఖల అధికారుల సమన్వయ లోపమే దీనికి కారణమని చెబుతున్నారు. అధికారుల ఆదేశాలతో తప్పక బయోమెట్రిక్ అటెండెన్సు వేస్తున్నామని సిబ్బంది చెబుతున్నారు.
సిఫార్సు