గ్రీన్ విజయనగరంలో ప్రతీఒక్కరూ పాల్గొనాలి..


Ens Balu
2
ఇండస్ట్రియల్ ఏరియా
2020-11-11 21:08:54

విజయనగరం జిల్లా కేంద్రం లోని ఏ.పి.ఐ.ఐ.సి. పారిశ్రామిక వాడ రోడ్డులో నిర్మించిన సెంటర్ డివైడర్ లో బుధవారం  ఉదయం జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రీన్ విజయనగరం కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చుట్టూ ఉన్న కలుపు మొక్కలును క్లియర్ చేస్తూ స్వచ్ఛ్ సేవలో పాల్గొన్నారు. ప్రతీ ఒక్కరూ ఐదు మొక్కలు నాటి అవి చెట్లు అయ్యేదాకా సంరక్షించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో వున్న ప్రతీఒక్కరూ తమ ఇంటిదగ్గరైనా ఈ విధంగా మొక్కలు నాటడం ద్వారా కాలుష్యాన్ని సైతం నియంత్రించడానికా అవకాశం వుంటుందన్నారు. కొనా కార్పస్ మొక్కలను హరిత విజయనగరం బృందం సభ్యులు మున్సిపల్ కమిషనర్ s.s.వర్మ,ఇంటెలిజెన్స్ డిఎస్సీ మధు, జనరల్ మేనేజర్ కె.ప్రసాద్ ,డిప్యూటీ డైరెక్టర్ ఆర్.పాపారావు,ఏడి సీతారాం ,ఏపీఐఐసి జోనల్ మేనేజర్ బి.సుధాకర్, Dr. వెంకటేశ్వరరావు గారు,హరిత విజయనగరం కో.ఆర్డినేటర్ రామ్మోహన్, ఇండస్ట్రియల్ ఏరియా సిబ్బంది , ప్లాంటేషన్ రవి , సిబ్బంది పాల్గొన్నారు.