విద్యాభివ్రుద్ధికి అబుల్ కలాం ఆజాద్ మార్గదర్శి..


Ens Balu
3
కలెక్టరేట్
2020-11-11 21:19:10

భారత దేశపు తొలి విద్యాశాఖా మంత్రి గా విద్య లో అనేక సంస్కరణలను తీసుకువచ్చిన గొప్ప మానవతవాది, రచయత, బహు భాష కోవిదులు భారతరత్న  మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని జిల్లా కలెక్టర్ డా. హరి జవహర్ లాల్ పేర్కొన్నారు.   వారి జన్మదినోత్సవాన్ని ప్రతి ఏటా మైనారిటీల సంక్షేమ దినోత్సవం గాను, జాతీయ విద్య దినం గానూ జరుపుకోవడం  వారికి ప్రభుత్వం  ఇచ్చే గౌరవమని తెలిపారు.  బుధవారం కలెక్టరేట్  ఆడిటోరియం లో భారత రత్న అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.  అంతకుముందు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి వెలగపూడిలో మైనారిటీ దినోత్సవం వేడుకలను వీడియో  కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు.  వీడియో  కాన్ఫరెన్స్ అనంతరం  కలక్టరేట్ ఆడిటోరియంలో  జరిగిన  కార్యక్రమంలో తొలుత  జ్యోతిని  వెలిగించి , అబుల్ కలాం చిత్రపటానికి పూల మాలలతో అలంకరించారు.  అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ  అబుల్ కలాం  విద్య రంగానికి చేసిన కృషిని స్పూర్తిగా తీసుకొని  రాష్ట్రం లో అనేక పధకాలను అమలు చేస్తున్నారని, ఆ పధకాలను జిల్లాలో  అమలు పరచే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉందని కలెక్టర్ అబిప్రాయ పడ్డారు.  నాడు-నేడు పధకం ద్వారా పాఠశాలల   మౌలిక వసతులను మెరుగుపరచడం, విద్యార్ధులకు పుస్తకాలు,యూనిఫారాలు , ఇతర సౌకర్యాలతో పాటు అమ్మ ఒడి,   జగనన్న విద్యా దీవన, జగనన్న వసతి దీవెన వంటి పధకాలను అమలుపరుస్తూ విద్యకు పెద్ద పీట వేయడం జరుగుతోందన్నారు.  ముస్లిం మైనారిటీల అభివృద్దికి వక్ఫ్ బోర్డు ద్వారా  ఆస్తులను రీ  సర్వీ చేయించి  డిజిటలైస్  చేయించడం ద్వారా పరిరక్షించడం జరుగుతోందన్నారు.  విజయనగరం లో  ఖాళీగా ఉన్న ఉర్దూ టీచర్ పోస్ట్ ను  ముస్లిం ల విజ్ఞప్తి మేరకు  పూరించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.         అభుల్ కలాం ఆజాద్ జయంతి రోజునే జిల్లాకు జలవనరుల నిర్వహణ లో జాతీయ అవార్డు రావడం ఆనందగా ఉందని కలెక్టర్ తెలిపారు.   జిల్లాలోని చెరువుల పరిరక్షణలో భాగంగా మన ఊరు- మన చెరువు, చెరువు శుద్ది కార్యక్రమాలు పెద్ద  ఎత్తున చేపట్టడం జరిగిందని,  అందుకు స్వచ్చంద సంస్థలు, ఉద్యోగులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు, పాత్రికేయులు తోడ్పడ్డారని, సమిష్టి కృషితో జాతీయ గుర్తింపు లభించిందని హర్షం వెలిబుచ్చారు. సేవ భావం తో పని చేస్తే గుర్తింపు దానికదే వస్తుందని చెప్పడానికి  ఈ అవార్డే  ఉదాహరణ అన్నారు.  నీటి పరిరక్షణ వలన భావి తరాలకు  నీటి కష్టాలు ఉండవని, రైతులకు, పర్యావరణా నికి మేలు జరుగుతుందని, ఈ కార్యక్రమాలు నిరంతరం జరగాలని , అందుకు జిల్లా ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.   ఈ కార్యక్రమం లో సంయుక్త కలెక్టర్ లు డా. జి.సి.కిషోర్ కుమార్, జె. వెంకట రావు, జిల్లా రెవిన్యూ అధికారి ఎం. గణపతి రావు, ముస్లిం  ప్రతినిధులు ఎం.ఎ రహీం, బాషా, మునీర్, షేక్ కాసిం, హాజీ ఇక్బాల్, ఎస్.కే. కరీం, సుభాని, బషీర్, రషీద్, జోహార్ తదితరులు పాల్గొన్నారు.