శ్రీవిద్యానికేతన్ తిరుపతికి ఆక్స్ ఫర్డ్ లాంటిది..
Ens Balu
2
Tirupati
2020-11-11 21:20:42
తిరుపతి అర్బన్ ప్రాంతంలో ఆక్సఫర్డ్ లాంటి శ్రీవిద్యానికేతన్ విద్యాలయం ఉండటంటం విద్యాభివ్రుద్ధికి నిదర్శనమని అర్భన్ ఎస్పీ ఏ.రమేష్ రెడ్డి అన్నారు. శ్రీ విద్యానికేతన్ అధినేత డా.మోహన్ బాబు తో కలిసి శ్రీ సాయినాథ్ నగర్ రంగంపేట సంస్థ కళాశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఇక్కడ చదువుకున్న విద్యార్థులకు చాలా అద్రుష్టవంతులని మంచి వాతావరణంలో విద్య అభ్యసించడం ద్వారా ఉన్నత శిఖరాలను అదిరోహించడానికి వీలుపడుతుందన్నారు. కష్టపడి చదివితే సాధించరానిది అంటూ ఏది లేదన్నారు. ప్రతి ఒక్కరు కష్టపడి తల్లిదండ్రులను గుర్తించుకొని చదువుకొని ఉన్నత స్థితికి వెళ్ళాలి. ముఖ్యంగా పోలీస్ కన్నా ముందు ఇక్కడ చదువు నేర్పే గురువులే మీకు తొలి భద్రత అన్నారు. వారి తరువాత తల్లిదండ్రులు, వీరి తరువాత పోలీస్ ఉంటారన్నారు. ఉపాద్యాయులకు, తల్లిదండ్రులకు గౌరవం ఇచ్చి క్రమశిక్షణతో, మంచి నడవడికతో ఉన్నత స్థితికి చేరే మార్గాలను చూసుకోవాలి. శ్రీ విద్యానికేతన్ విద్యాలయం తిరుపతి నగరానికి దూరంగా ఉండటం వలన భద్రతా పరమైన కారణాలతో ఇక్కడ చదువుకునే విద్యార్థులకు గాని, పరిసర ప్రాంతంలోని ప్రజలకు గాని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ 24X7 పోలీస్ సిబ్బంది ఉండేటట్లు ఏర్పాటు చేశామన్నారు. ఇది శ్రీ విద్యానికేతన్ యాజమాన్యం యొక్క సహకారంతో ఏర్పాటు చేశామన్నారు.విద్యార్థులకు గాని, ప్రజలకు గాని ఏదైనా అవసరం వచ్చినా, అత్యవసర పరిస్థితి వచ్చినా కూడా ఇక్కడ పోలీస్ సిబ్బంది సహకారం తీసుకోవచ్చునన్నారు. ఈ సందర్బంగా యస్.బి డి.యస్.పి గంగయ్య, వెస్ట్ డి.యస్.పి నరసప్ప, యూనివర్సిటీ సి.ఐ రవీంద్ర, యం.ఆర్ పల్లి సి.ఐ సురేంద్ర రెడ్డి మరియు విద్యాలయ యాజమాన్య సిబ్బంది, విద్యార్థినీలు పాల్గొన్నారు.