పద్మావతి వార్షిక బ్రహ్మోత్సవాలకు భద్రత కట్టుదిట్టం..
Ens Balu
3
Tirupati
2020-11-11 21:33:10
శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతిలో గట్టిబధ్రతా చర్యలు తీసుకున్నట్టు అర్భన్ ఎస్పీ ఏ.రమేష్ రెడ్డి చెప్పారు. బుధవారం ఆయన బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ, కోవిడ్ దృష్ట్యా కోవిడ్-19 కారణంగా అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతం అయినప్పటికి అనుకోని విధంగా భక్తుల రద్దీ పెరిగితే వాటిపై తీసుకోవలసిన జాగ్రత్తలపై సిబ్బందికి సూచనలు జారీచేశామన్నారు. అంతేకాకుండా భద్రతా ఏర్పాట్లపై ఆలయ పరిసర ప్రాంతాలు, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించి తీసుకోవలసిన జాగ్రత్తలను సూచించినట్టు వివరించారు. ఉన్నతాధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చే సమయంలో కూడా కల్పించాల్సిన భద్రతపై కూడా ట్రాఫిక్ సిబ్బందికి సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో యస్.బి డి.యస్.పి గంగయ్య, ఈస్ట్ డి.యస్.పి మురళీకృష్ణ, ట్రాఫిక్ డి.యస్.పి మల్లికార్జున, తిరుచానూర్ సి.ఐ సుదాకర్ రెడ్డి, ట్రాఫిక్ సి.ఐ సురేష్ కుమార్ వారు పాల్గొన్నారు.