పర్యావరణ రహితంగా దీపావళి..


Ens Balu
3
కలెక్టరేట్
2020-11-11 21:46:13

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తగ్గనందున జిల్లాలోని ప్రజలందరూ పర్యావరణ హితమైన దీపావళి జరుపుకోవాలని జిల్లా కలెక్టరు వి. వినయ్ చంద్  పిలుపునిచ్చారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జిటి) ఉత్తర్వులు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ ప్రతిపాదనలు ప్రకారం కలెక్టరు కొన్ని సూచనలు చేశారు. కరోనా వ్యాప్తిలో నున్నందున గాలిలో కాలుష్యం పెరిగినట్లయితే మరింత ప్రమాదం పొంచి ఉంటుంది అన్నారు. కోలుకున్న వారి శ్వాసకోశాల పైన బాణసంచా కాలుష్యం  తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుందని నిపుణులు హెచ్చరించినట్లు కలెక్టర్ తెలిపారు. తక్కువ కాలుష్యాన్ని కలిగిన బాణసంచాను   మాత్రమే విక్రయించాలని, వాటిని మాత్రమే అందరూ ఉపయోగించాలన్నారు. బాణసంచా వెలిగించే సమయం  2 గంటలకు పరిమితం చేయబడిందని దీపావళి రోజున. రాత్రి 8.00 గం.ల నుండి 10.00 గం.ల వరకు మాత్రమే బాణసంచాను వెలిగించాలి. బాణాసంచా   విక్రయించే అన్ని దుకాణాలు ప్రతి దుకాణం మధ్య 10 అడుగుల దూరాన్ని నిర్వహించాలి. క్రాకర్లను కొనుగోలు చేయడానికి వచ్చే వ్యక్తులు దుకాణాల ముందు క్యూలో 6 అడుగుల సామాజిక దూరాన్ని  పాటించేలా చర్యలు తీసుకోవాలి. కొనుగోలుదారులు దీపావళి వేడుకల సందర్భంగా హ్యాండ్ శానిటైజర్‌ను ఉపయోగించవద్దని   దాని స్థానంలో సాధారణ సబ్బును వాడాలని సూచించారు.  తగిన జాగ్రత్తలతో  పర్యావరణ హితమైన బాణసంచాను ఉపయోగిస్తూ జిల్లా ప్రజలందరూ ఆనందంగా ఆరోగ్య దీపావళి  జరుపుకోవాలని కలెక్టరు కోరారు.