వీరఘట్టం ఎంపీడీఓకి కలెక్టర్ షోకాజ్ నోటీస్..
Ens Balu
5
Veeraghattam
2020-11-11 21:49:46
శ్రీకాకుళం జిల్లా వీరఘట్టాం మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి.పైడితల్లికి జిల్లా కలెక్టర్ జె.నివాస్ షోకాజ్ నోటీసు జారీచేసారు. 9వ తేదీన రాష్ట్ర ముఖ్య మంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పర్యటనలో భాగంగా వీరఘట్టాం మండలం వండువ గ్రామ సచివాలయం సందర్శించారు. ఆ సమయంలో గ్రామ సచివాలయం ఆవరణలో ప్రదర్శించాల్సిన చేయూత, కాపు నేస్తం లబ్దిదారుల జాబితాను ప్రదర్శించలేదు. గ్రామ సచివాలయంలో ప్రదర్శించాల్సిన ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికి విధుల పట్ల నిర్లక్ష్యం వహించడంపై షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి బుధ వారం తెలిపారు. షోకాజ్ నోటీసుపై తగు సంజాయిషీని రెండు రోజుల్లో సమర్పించాలని ఆదేశించారు. ఉద్యోగంలో నిర్లక్ష్యం వహించినందుకు క్రమశిక్షణా చర్యలు ఎందుకు తీసుకోరాదో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. ఎంపీడీఓకి జిల్లా కలెక్టర్ షోకాజ్ నోటీసు జారీచేయడంతో జిల్లాలోని సచివాలయ సిబ్బందిలో కలకలం మొదలైంది. ఎంపీడీఓకే షోకాజ్ నోటీసు ఇస్తే..తప్పుచేసిన సచివాలయ సిబ్బందిని సస్పెండ్ చేసేస్తారంటూ ప్రచారం జరగడం విశేషం..