పి.శ్రీనివాసరావుకి జెఎన్టీయూ పీహెచ్డీ..
Ens Balu
3
కాకినాడ, జెఎన్టీయూ
2020-11-12 13:40:33
జవహర్ లాల్ నెహ్రూ సాంకేతి విశ్వవిద్యాలయం పి.శ్రీనివాసరావు కి బుధవారం కాకినాడలో పీహెచ్డీ డిగ్రీ ప్రధానం చేసింది. పరిశీలకుల బృందం సిఫార్సు మేరకు ఆయన సిద్ధాంత వ్యాసం ‘‘మ్యూచువల్ కప్లింగ్ రిడక్షన్ ఇన్ మిమో యాంటెన్నాస్’’ జెఎన్‌టియుకె అధికారులచే ఆమోద ముద్ర పొందినది. ఈయనకు పిహెచ్‌డి ‘డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ’ అవార్డు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో లభించినది. పి.శ్రీనివాసరావు తన సిద్ధాంత వ్యాసాన్ని ప్రకాశం జిల్లా చీరాలలోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ ఈసిఈ విభాగం ప్రొఫెసర్ డా.కె.జగదీష్ బాబు మరియు కాకినాడలోని జెఎన్‌టియుకె యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ (యుసిఇకె) ఈసిఇ విభాగం ప్రొఫెసర్ డా.ఏ.ఎం.ప్రసాద్ ఆధ్వర్య పర్యవేక్షణలో సమర్పించారు. శ్రీనివాసరావుకి పీహెచ్డీ అవార్డు లభించడం పట్ల, సహచర అద్యాపకులు, ఇతరులు హర్షం ప్రకటించారు. మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు..