15న ఆ ఉద్యోగాలకు కంప్యూటర్ పరీక్ష..
Ens Balu
2
Dr. Lankapalli Bullayya College
2020-11-12 20:20:26
విశాఖపట్నం జిల్లాలోని వై.ఎస్ ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ విభాగంలో ఆరోగ్య మిత్ర, టీం లీడర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులో అర్హులైన అభ్యర్ధులకు ఈనెల 15న విశాఖలో కంప్యూటర్ పరీక్ష నిర్వహించనున్నారు. విశాఖలోని డాక్టర్. ఎల్.బుల్లయ్య కళాశాల ప్రాంగణంలో పరీక్షలను నిర్వహిస్తామని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా. పి.ఎస్. సూర్యనారాయణ తెలిపారు . పరీక్షకు హాజరైన ప్రతి అభ్యర్ధి ఆధార్ కార్డును విదిగా తీసుకుని కాలేజీ ప్రాంగణానికి ఉదయం 9 గంటలకు సకాలంలో చేరుకోవాలి. అర్హులైన అభ్యర్ధులు మాత్రమే పరీక్షకు హాజరు కావాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధుల తాలూకా వివరాలను http://visakhapatnam.nic.in మరియు జిల్లా వైద్య మరియు ఆరోగ్య కార్యాలయం లోని నోటీసు బోర్డులో పొందుపరిచినట్టు డిఎంహెచ్ఓ తెలియజేశారు. నోటిఫికేషన్ లో ప్రకటించిన విద్యార్హతలు ప్రకారం ఆరోగ్య మిత్ర, టీం లీడర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నవారు మాత్రమే అర్హులు. డిప్లొమా ఇన్ ఫార్మసి అభ్యర్ధులు అర్హులు కాదని వివరించారు..