ప్రతీఒక్కరూ మొక్కలు నాటాలి..


Ens Balu
2
Srikakulam
2020-11-12 21:18:06

ప్రతీఒక్కరూ మొక్కలు నాటడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించుకోవడంతోపాటు, కాలుష్యాన్ని నియంత్రించడానికి వీలుపడుతుందని రెడ్ క్రాస్ ప్రతినిధి సత్యన్నారాయణ అన్నారు.గురువారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, శ్రీకాకుళం జిల్లా శాఖ  రాష్ట్ర వైస్ చైర్మన్ & జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్. పి. జగన్మోహన రావు గారి ఆధ్వర్యంలో   దమ్మల వీధి  38,39 డివిజన్లలో  వార్డు సచివాలయం వాలంటీర్స్ సహకారంతో   113 మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొక్కల పెంపకంలో వార్డు వాలంటీర్లు కలిసి రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో  వార్డు అడ్మిన్ జి. దుర్గా రావు, వి.ఆర్. ఓ. రోహిణి, ప్లానింగ్ ఆఫీసర్ ఝాన్సీ, హెల్త్ సెక్రటరీ విజయ చేతుల మీదుగా మొక్కలు నాటి వాలంటీర్స్ కి అందజేయడం జరిగింది, రెడ్ క్రాస్ సిబ్బంది సత్య నారాయణ, విజయ్, కోటేశ్వర రావు, శ్రీధర్, పవన్ , తవుడు మరియు  వాలంటీర్స్ రోషిని, సంతోష్, కృపాని,భారతి, నజ్మ, శిరీష, మాధురి మొదలగు వారు పాల్గొన్నారు.