దీపావళికి పరిమితంగానే అనుమతులు..


Ens Balu
2
Srikakulam
2020-11-12 21:27:37

దీపావళిలో పర్యావరణహిత టపాసులకు మాత్రమే అనుమతులు ఉన్నాయని కలెక్టర్ నివాస్ స్పష్టం చేసారు. రాత్రి 8 నుండి 10 గంటల వరకు మాత్రమే అనుమతించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. పర్యావరణహిత టపాసులకు మాత్రమే లైసెన్సులు జారీ చేస్తామని స్పష్టం చేసారు. టపాసులు కాల్చేటపుడు పూర్తి సురక్షిత చర్యలు చేపట్టాలని, అందుకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. శానిటైజర్ ఉపయోగించి టపాసులు కాల్చడం వలన అగ్ని ప్రమాదం సంబంధించవచ్చని పేర్కొన్నారు. రెవిన్యూ, అగ్నిమాపక శాఖ అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.  ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, టెక్కలి సబ్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ గరోడా,  జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, జిల్లా పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఏ.కృష్ణారావు, బిసి కార్పొరేషన్ ఇడి జి.రాజారావు, ఆర్డబ్ల్యుఎస్ ఇఇ చంద్ర శేఖర్, సహాయ కలెక్టర్ ఎం.నవీన్, వ్యవసాయ శాఖ జెడి కె.శ్రీధర్, మత్స్య శాఖ జెడి పివి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.