సోలార్ ప్లాంట్ బాధితులకు చెక్కులు పంపిణీ..


Ens Balu
2
Nandyala
2020-11-12 21:37:50

సోలార్ ప్లాంట్ కొరకు భూములు కోల్పోయిన రైతులకు కు1.57 కోట్ల రూపాయల చెక్కులను జిల్లా కలెక్టర్ వీరపాండియన్, పాణ్యం శాసనసభ్యులు కాటసాని రామ్ భూపాల్ రెడ్డి గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వీరపాండియన్ మీడియాతో  మాట్లాడుతూ,  గడివేముల మండలం గని గ్రామ రైతులు సోలార్ ప్లాంట్ కొరకు భూములు కోల్పోయారని ఈ 13 మంది రైతులకు1.57 కోట్ల రూపాయల చెక్కులను పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టు విషయంలో రైతులు నష్టపోకుండా ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుందన్నారు. అందులోభాగంగానే..ఈ మొత్తం పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో  జిల్లా SP డా..పక్కిరప్ప. పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి నంద్యాల సబ్ కలెక్టర్  కల్పనా కుమారి తదితరులు పాల్గొన్నారు.