కళాశాలు కోవిడ్ నిబంధనలు పాటించాలి..


Ens Balu
2
Srikakulam
2020-11-13 15:12:52

శ్రీకాకుళం జిల్లాలో కళాశాలలు కోవిడ్ నింబంధనలు పాటిస్తూ తరగతులను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని శ్రీకాకుళం నగర పాలక సంస్ధ కమీషనర్ పి.నల్లనయ్య పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్ కు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల యాజమాన్యాలకు ఈ మేరకు శుక్ర వారం ఉత్తర్వులు జారీ చేసారు. ప్రతి పాఠశాల, కళాశాల ప్రవేశ ద్వారం వద్ద “నో మాస్క్ – నో ఎంట్రీ “ హోర్డింగ్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, విద్యార్థులoదరికీ కరోనాపై జాగ్రత్తలు తెలియజేస్తూ అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. తప్పనిసరిగా  మాస్క్ వాడకం, భౌతిక దూరం పాటించడం, చేతులు పరిశుభ్రత పై పోస్టర్లు లేదా ఫ్లెక్స్ లను అసెంబ్లీ పాయింట్ వద్ద, తరగతి గదుల లోపల అతికించాలని అన్నారు. క్లాసు రూoలను సోడియం హైపోక్లోరైడ్ తో పరిశుభ్రపరచాలని,  మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడరుతో పరిశుభ్రపరచాలని ఆయన స్పష్టం చేసారు. జూనియర్ కాలేజీలో 50 శాతం విద్యార్థుల వరకు మాత్రమే హాజరు కావాలని, ప్రతి తరగతి గదిలో 16 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా చూడాలని ఆయన సూచించారు. డిగ్రీ కాలేజీలో 33 శాతం విద్యార్థులు మాత్రమే హాజరు కావాలని, 10 రోజులకు ఒక బ్యాచ్ చొప్పున నెలలో 3 బ్యాచ్ లుగా విద్యార్థులను విభజించి తరగతులు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని తెలిపారు. దూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులు తరగతులకు హాజరుకాకుండా సూచనలు చేయాలని ఆయన పేర్కొన్నారు. స్థానికంగా ఉండే విద్యార్థులు మాత్రమే హాజరు కావాలని అన్నారు. ఇతర విద్యార్థులకు ఆన్ లైన తరగతులు నిర్వహించాలని అన్నారు. పాఠశాల విద్యార్థులoదరూ జగనన్న విద్యా కానుకగా యిచ్చిన ఏకరూప దుస్తులు, బూట్లు విధిగా తప్పని సరిగా ధరించాలని ఆయన పేర్కొన్నారు. పాఠశాల, కళాశాలలకు హాజరుయ్యే బోధన, బోధనేతర సిబ్బంది అందరూ కూడా కరోనా పరీక్షలు చేయించకోవాలని ఆయన సూచించారు. పాఠశాలలు, కళాశాలలకు హాజరుయ్యే సిబ్బంది, విద్యార్ధులు ఎవరికైన జ్వరం, దగ్గు, జలుబు, ఆయాసం, తదితర ఆరోగ్య సమస్య ఉంటే సమీప వార్డ్ సచివాలయ హెల్త్ సెక్రెటరీకి గానీ, వైద్యునికి గారికి గానీ వెంటనే సమాచారం అందించాలని ఆయన స్పష్టం చేసారు. కరోనా పరీక్షలు చేయించుకున్న తరువాత ఎవరికైనా “ కరోనా పాజిటివ్ “ గా నిర్ధారణ అయితే కంగారు పడాల్సిన అవసరం లేదని, హెల్త్ సెక్రెటరీ లేదా వైద్యుడికి తెలియజేసి తగిన సలహాలు, సూచనలు ఇస్తూ హోమ్ ఐసోలేషన్ కిట్లను పొంది ఉపయోగించాలని అన్నారు.