సురక్షితంగా దీపావళిని జరుపుకోవాలి..


Ens Balu
3
Visakhapatnam
2020-11-13 15:58:45

మహావిశాఖ నగరవాసులు సురక్షిత, కాలుష్య రహిత దీపావళి జరుపుకోవాలని ప్రముఖ సంఘసేవకులు సాన రాధ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆమె విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, కరోనా సమయంలో చాలా మంది ప్రజలకు ఎంతో నష్టపోయారని ఇలాంటి సమయంలో దీపావళి పండుగను అసలైన దీపాల సమూహంతోనే నిర్వహించుకోవాలన్నారు. ఒక వేళ టపాసులతో దీపావళి చేసుకున్నప్పటికీ కాలుక్ష్యం తక్కువగా వుంటే పటాలసుతో దీపావళి జరుపుకోవాలన్నారు. ఇదే సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించినట్టు దీపావళి చేసుకునే సమయంలో అంతా పరిశుభ్రంగా సబ్బుతో చేతులు కడుక్కోవాలి తప్పితే ఎవరూ శానిటైజర్లు ఉపయోగించకూడదన్నారు. శానిటైజర్లలో మండే స్వభావం కలిగిన ఆల్కాహాలు ఉన్నందున ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా వుంటాయన్నారు. అంతేకాకుండా దీపావళి జరుపుకునే సమయంలో అందరూ కాటన్ దుస్తులు మాత్రమే ధరించాలన్నారు. ఎక్కువగా దీపాల సమూహాన్ని ఇంటిలో ఏర్పాటు చేసుకొని అసలైన దీపావళిని జరుపుకోవడానికి అంతా ముందుకు రావాలని సాన రాధ పిలుపునిచ్చారు.