పరిశ్రమల్లో భద్రత ప్రామాణాలు పాటించాల్సిందే..
Ens Balu
2
విజయనగరం
2020-11-13 16:01:46
విజయనగరం జిల్లాలోని పరిశ్రమల్లో భద్రత విషయమై ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల మేరకు అన్ని పరిశ్రమలు ప్రమాదాలకు అవకాశాలకు లేకుండా తగిన భద్రత చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు అన్నారు. జామి మండలం అన్నంరాజుపేటలోని శ్రీచక్ర సిమెంటు పరిశ్రమను జాయింట్ కలెక్టర్ జె.వెంకటరావు నేతృత్వంలోని అధికారుల బృందం సందర్శించింది. పారిశ్రామిక భద్రత విషయంలో ప్రభుత్వం రాజీలేని ధోరణి అవలంబిస్తోందని, ఆయా పరిశ్రమలు తమ పరిశ్రమల్లో చేపట్టిన భద్రతా చర్యలపై తమ కమిటీకి నివేదిక ఇవ్వాలన్నారు. శ్రీచక్ర సిమెంట్స్‌లో చేపట్టిన భద్రత చర్యలపై పరిశ్రమ అధికారులు జాయింట్ కలెక్టర్‌కు, బృందం సభ్యులకు వివరించారు. ఈ బృందంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ కోట ప్రసాదరావు, కాలుష్య నియంత్రణ మండలి ఇంజనీర్ బి.సుదర్శనం, జిల్లా అగ్నిమాపక అధికారి జె.మోహనరావు, డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.