పర్యావరణ రహిత దీపావళినే జరుపుకుందాం..scrwa


Ens Balu
3
Visakhapatnam
2020-11-13 16:12:33

కారోనా మహమ్మారి ప్రభావం ఇంకా ప్రమాదకరంగానే ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ దీపావళిని పర్యావరణ హితంగా జరుపుకోవాలని   స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ ఆకాంక్షించారు. శుక్రవారం విశాఖలోని ఓ ప్రైవేటు హోటల్ లో జరిగిక కార్యక్రమంలో జర్నలిస్టులకు దీపావళి పండుగను పురస్కరించుకుని  స్వీట్లు, హేండ్ మేడ్ కొవ్వొత్తులు, ప్రమిదులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అతిధులు మాట్లాడుతూ, స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వ్యాపారవేత్త  లంకలపల్లి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ బంగారు అశోకుమార్ ఆధ్వర్యంలో అసోసియేషన్ లోని సభ్యులైన జర్నలిస్టుల ప్రతి ముఖ్య సంధర్భంలోనూ వారి కుటుంబాల్లోని సభ్యులందరికీ ఆనందం పంచే విధంగా ఏర్పాటు చేసే ఇలాంటి కార్యక్రమాలు ఆదర్శనీయం అన్నారు. సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి పండుగలతో పాటు ఇతర ముఖ్య సందర్భాల్లోను జర్నలిస్టుల కోసం వారి సంక్షేమం కోసం ఏదో విధంగా బాసటగా ఉండాలనే తలంపుతో కూడిన ఆరాటం స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు. సమాజం కోసం నిత్యం వార్తా సమీకరణలో బిజీగా తిరిగే జర్నలిస్టుల సంక్షేమం కూడా బాగా ముఖ్యమని చెప్పారు. ప్రస్తుతం కారోనా వైరస్ ప్రమాదకరంగా ఉన్నందున దీపావళి బాణా సంచా వెదజల్లే కాలుష్యం ఊపిరితిత్తులకు చేటు చేసే ప్రమాదం ఉందని నిపుణుల చెబుతున్నందున ఈ ఏడాది అత్యంత జాగ్రత్తగా దీపావళి జరుపుకోవడం ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. దీపావళి పండుగ కుటుంబ సభ్యులకు ప్రమాదకారి కాకూడదని భావించారు. గతంలో హుదూద్ తుఫాను వచ్చి విళయం ప్రళయం సృష్టించి వెళ్ళాక అప్పటి ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు కేవలం దీప కాంతుల దీపావళికే పరిమితం అయ్యి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన విశాఖ ఈ కారోనా పరిస్థితుల్లోను ఆదే అప్రమత్తత, పర్యావరణ హితకర దీపావళి జరుపుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ఆరోగ్యంగా ఉంటే అన్నీ ఉన్నట్లేనని చెబుతూ జర్నలిస్టుల సంపూర్ణ ఆరోగ్య వంతులుగా ఉంటేనే, సమాజం కోసం ఆరాటపడే వారి ఆశయం, లక్ష్యం నెరవేరలని ఆశించారు. వారు పాటించడంతో పాటు ప్రజలు కూడా పర్యావరణ హితకర దీపావళిని జరుపుకునేలా చైతన్యవంతులని చేయగలరని   పేర్కొన్నారు. అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ బంగారు అశోకుమార్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం 2016వ సంవత్సరం నుంచి క్రమం తప్పకుండా కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఉన్నామన్నారు. ఎప్పటికప్పుడు సౌజన్యముర్తుల సహాయంతో అసోసియేషన్ లోని సభ్యులైన జర్నలిస్టుల సంక్షేమం చేస్తున్నట్లుగా వివరించారు. గతంలో కంటే ఇప్పుడు సభ్యుల సంఖ్య కూడా ఇతోధికంగా పెరుగుతుండడం ఆనందదాయకం అన్నారు. కేవలం నగరం వరకు మాత్రమే పరిమితం కాకుండా అన్ని ప్రాంతాల జర్నలిస్టులు స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లో సభ్యులయ్యేందుకు ఆసక్తిని కనబరుస్తున్ననందున ప్రత్యేక డ్రైవ్ గా ప్రస్తుతం సభ్యత్వ నమోదు జరుపుతున్నామన్నారు. ఇప్పటికే ఉన్న సభ్యులు కొత్త సభ్యుల నమోదు లో ముఖ్యభూమిక వహించడం, సహృద్భావంతో  అందరము కలిసికట్టుగా మనందరి కుటుంబ సభ్యుల సంక్షేమానికి తలపెట్టే కార్యక్రమంల్లో భాగస్తులు కావాలని అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ బంగారు అశోక్ కుమార్ ఆహ్వానించారు. కరోనా కారణముగా ఈ ఏడాది సంక్షేమ కార్యక్రమాలకు కొంత విరామం వచ్చిందన్నారు. తిరిగి దీపావళి నుంచి యధావిధిగా సభ్యులైన వారందరికీ గతంలో కంటే మిన్నగా సంక్షేమ ఫలాలు అందించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. అసోసియేషన్ ముందుకు నడిపించడంలో భాగస్తులవుతున్న ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పీవీబీ కుమార్, బీఎస్ చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి కర్రి సత్యనారాయణ, కార్యదర్శి నక్కాన అజయ్ కుమార్, ఉపాధ్యక్షులు కాళ్ళ సూర్యప్రకాష్ (కిరణ్), రిషి, రామకృష్ణ, సంయుక్త కార్యదర్శి పద్మజా తదితరులు పాల్గొన్నారు.