విశాఖ వికాసానికి సీఎం జగన్ విశేష కృషి..


Ens Balu
1
RK Beach
2020-11-13 16:21:12

 విశాఖ వికాసానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌ ‌జగన్‌ ‌మోహన రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. శుక్రవారం  బీచ్‌ ‌రోడ్డులో నిర్వహించిన వుయ్‌ ‌సపోర్ట్ ‌వైజాగ్‌ ‌వాకథాన్‌లో ఆయన పాల్గొన్నారు. భవిష్యత్తులో రాష్ట్రానికి ఆర్ధిక రాజధానిగా విశాఖ నగరం నిలుస్తుందని ఆయన అన్నారు. పెద్దసంఖ్యలో  ఇంజనీరింగ్‌ ‌కళాశాలల అధ్యాపకుల  వాట్సాప్‌ ‌గ్రూప్‌ ‘‌వాక్‌ ‌విత్‌ ‌జగన్‌ ‌గ్రూప్‌’  ‌సభ్యులు ఎం.పి. విజయ సాయి రెడ్డికి స్వాగతం పలికి ఆయనతో కలసి వాకథాన్‌లో పాల్గొన్నారు. అనంతరం వీసీ ప్రసాద రెడ్డి మాట్లాడుతూ విశాఖ అభివృద్ధిని ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. పరిశుభ్ర, ప్రశాంత విశాఖను నిర్మించే దిశగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారన్నారు. పరిపాలనా రాజధానిగా రూపుదిద్దుకుంటున్న విశాఖను సుందర నగరంగా తీర్చిదిద్దడంలో యువత భాగం కావాలన్నారు. భవిష్యత్తులో నిర్వహించే బీచ్‌ ‌క్లీనింగ్‌, ‌పర్యావరణ పరిరక్షణ వంటి కార్యక్రమాలలో ఏయూ జాతీయ సేవా పథకం వలంటీర్లు ముఖ్యభూమిక పోషిస్తారన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్‌ ‌జగన్‌ ‌మోహన రెడ్డి విశాఖ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారన్నారు. ఆయన దార్శినిక నిర్ణయాలు భవిష్యత్తులో రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలుపుతాయన్నారు. ఏయూ అనుబంధ ఇంజనీరింగ్‌ ‌కళాశాలల అధ్యాపకుల బృందం గతంలో 2018 సంవత్సరంలో నిర్వహించిన ప్రజా సంకల్పయాత్రలో ఇంజనీర్స్‌డే వేడుకలను పురస్కరించుకుని వై.ఎస్‌ ‌జగన్‌ ‌మోహన రెడ్డి గారితో యాత్రలో కలసి పాల్గొన్నారు. అదే బృందం నేడు వాకథాన్‌ ‌కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు.కార్యక్రమంలో వర్సిటీ పాలక మండలి సభ్యులు జేమ్స్ ‌స్టీఫెన్‌ , ‌డీన్‌ ఆచార్య టి.షారోన్‌ ‌రాజు తదితరులు పాల్గొన్నారు.