భవిష్యత్ తరాల అవసరాలు తీర్చాలి..


Ens Balu
0
ఆంధ్రాయూనివర్శిటీ
2020-11-13 16:28:13

గ్రంధాలయాలు భవిష్యత్‌ ‌తరాల అవసరాలను తీర్చే దిశగా పనిచేయాలని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. ఏయూ డాక్టర్‌ ‌వి.ఎస్‌ ‌క్రిష్ణా గ్రంధాలయంలో నిర్వహించిన గ్రంధాలయ వారోత్సవాల ప్రారంభోత్సవంలో భాగంగా వీసీ ఆన్‌లైన్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఆకాంక్షలు, అవసరాలు గుర్తించి తదనుగుణంగా గ్రంధాలయాలు పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏయూ గ్రంధాలయం ఎందరో విద్యావంతులను, నిపుణులను తీర్చిదిద్దిందన్నారు. వీరంతా దేశ విదేశాలలో స్థిరపడ్డాన్నారు. నేటి తరం యువత పుస్తకాన్ని పక్కనపెట్టి ఫేస్‌బుక్‌కు అంకితమైపోతున్నారన్నారు. డిజిటల్‌ ‌లైబ్రరీలు, పుస్తకాల డిజిటలైజేషన్‌ ఎం‌తో కీలకమన్నారు. విద్యార్థులు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు తమకు అవసరమైన సమాచారాన్ని పొందే అవకాశం ఉండాలన్నారు. గ్రంధాలయాధికారి ఆచార్య కె.విశ్వేస్వర రావు మాట్లాడుతూ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు ప్రాధాన్యతను వివరించారు. వారోత్సవాలలో భాగంగా ఆన్‌లైన్‌లో వివిధ కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. ఆన్‌లైన్‌ ‌సదస్సులో గ్రంధాలయ సిబ్బంది మాధవరావు, రమాదేవి, హైమావతి, రామలక్ష్మి, సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.