ప్రజాసేవలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు..
Ens Balu
1
లక్కవరపుకోట
2020-11-13 17:01:49
గ్రామసచివాలయాల ద్వారా సిబ్బంది ప్రజలకు మానవతా ద్రుక్పదంతో సేవలు అందించాలని జాయింట్ కలెక్టర్ ( ఆసరా, సంక్షేమం) జె.వెంకటరావు ఆదేశించారు. శుక్రవారం జిల్లాలోని లక్కవరపుకోట మండలం కేంద్రంలోని గ్రామ సచివాలయాన్ని జెసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలోని సిబ్బంది హాజరు శాతాన్ని, రికార్డులను పరిశీలించారు. సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యశ్రీ కార్డులు, బియ్యం కార్డుల పంపిణీ వివరాలను తెలుసుకున్నారు. వైఎస్ఆర్ జలకళ, పింఛన్లు తదితర సంక్షేమ పథకాలకు వచ్చిన దరఖాస్తులపై వాకబు చేశారు. ఇ-రిక్వెస్టులు పెండింగ్‌పై ఆరా తీశారు. సకాలంలో విధులకు హాజరు కావాలని, ప్రజలకు అందుబాటులో ఉండి, మెరుగైన సేవలను అందించాలని జెసి వెంకటరావు ఆదేశించారు. విధినిర్వహణలో అలసత్వం ప్రదర్శించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న జెసి, సిబ్బంది సమయపాలన పాటించాలని విధులకు డుమ్మాకొట్టేవారిని ఉపేక్షించేది లేదన్నారు...