అనంత వాసులకి దీపావళి శుభాకాంక్షలు..


Ens Balu
2
కలెక్టరేట్
2020-11-13 17:16:03

అనంతపురం జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు  దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రీన్ టపాసులతో దీపావళి జరుపుకోవాలని, పండుగ రోజు రాత్రి 8 గం. నుంచి 10 గం. మధ్య బాణాసంచా కాల్చుతూ పండుగను జాగ్రత్తగా జరుపుకోవాలని కలెక్టర్ సూచించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వుల మేరకు కోవిడ్ నుండి కోలుకున్న రోగులకు పొగ కాలుష్యం వల్ల ఇబ్బందులు కల్గకూడదని  వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు దీపావళి జరుపుకోవాలన్నారు. పర్యావరణాన్ని కూడా పరిరక్షించే బాధ్యత ప్రజలపై ఉందన్నారు.  ముఖ్యంగా బాణసంచా కాల్చేవారు, దీపాలు వెలిగించే మహిళలూ శానిటైజర్ కు దూరంగా ఉండాలన్నారు. శానిటైజర్ లోని ఆల్కహాల్ వల్ల అగ్నిప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున బదులుగా సబ్బు వాడాలని కోరారు. ప్రజలంతా దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోవాలని, ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగునింపాలని కలెక్టర్ ఆకాంక్షించారు.