ఆ ఐపీఎస్.. దాన గుణ సేవకుడు..


Ens Balu
3
తిరుపతి
2020-11-13 17:49:11

ఆయనను చూస్తే ఎవరూ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి అనుకోరు.. ఎవరినోట విన్నా ఆయన ఇండియన్  పీపుల్ సర్వీస్ ఆఫీసర్(దాన గుణ సేవకుడు) అంటారు..ఆ స్థాయిలో ఆ ఐపీఎస్ వ్యవహార శైలి వుంటుంది.. పోలీసు అధికారుల్లో ఐపీఎస్ అంటే ఇక చెప్పాల్సిన పనే లేదు ఎప్పుడూ చాలా బిజీగా ఉంటారు...కానీ చిత్తూరు జిల్లా తిరుపతి అర్భన్ ఎస్పీ ఏ.రమేష్ రెడ్డి అలా కాదు.. ఆయనను చూస్తే ఎవరికైనా స్నేహభావం మనసులో ఉద్బవిస్తుంది...ఐపీఎస్ ల్లో కూడా ఇంత మంచి అధికారులు ఉంటారా అనిపిస్తుంది..అంతలా ఆయన సేవా కార్యక్రమాలు చేపడతారు..ఆయన మంచి మనసుకి ఆయన సతీమణి కూడా తోడవడంతో ఆయన నిరుపమాన సేవలు నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి.  అందులో భాగంగా శుక్రవారం దీపావళి సందర్భంగా “పాస్ మనోవికాస్” ఆశ్రమానికి రూ.వేలు ఆర్ధిక సహాయం చేసి, అక్కడ అనాధపిల్లలతో కుటుంబ సభ్యులతో చాలా సరదగా గడిపారు. ఆయకొచ్చే జీతంలో సగభాగం నిరుపేదల సేవలకే వెచ్చిస్తున్నారంటే ఈ అధికారి దాన గుణం ఎలాంటిదో వర్ణించడానికి మాటలే చాలవు. సంస్థ నిర్వాహకులకు ఆర్ధిక సహాయంతోపాటు  ఆశ్రమంలో ఉన్న వారి కోసం  బియ్యపు బస్తాలు (10), టవళ్ళు, పండ్లు, పలహారాలు, దీపావళి గిఫ్ట్ పాకెట్స్ మొదలగు వాటిని “లక్షయ ఫర్ నీడ్” టీం వారితో కలసి అందించారు. ఎప్పుడైనా ఏ సమయంలోనైనా, ఏ అవసరం వచ్చినా తనను కలవాలని నా శక్తి మేర సహకారం అందిస్తానని నిర్వాహకులకు హామీ ఇచ్చారు. ఇంతటి సహాయం చేసిన రమేష్ రెడ్డి సేవలు ఎప్పుడూ రాష్ట్రంలో మార్గదర్శిగానే మారుతుంటాయి. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, సంస్థ నిర్వాహకులు పాల్గొన్నారు.