టిటిడి ప్రాజెక్టులతో సేవలందాలి..


Ens Balu
2
Tirupati
2020-11-13 18:22:54

తిరుపతిలోని శ్వేత భవనంతోపాటు టిటిడి ప్రాజెక్టులను జెఈవో(విద్య మ‌రియు ఆరోగ్యం) సదా భార్గ‌వి శుక్రవారం తనిఖీ చేశారు.  శ్వేత భవనంలో కోవిడ్ - 19పై టిటిడి ఉద్యోగులకు జరుగుతున్న ఆన్ లైన్ అవ‌గాహ‌న తరగతులను  పరిశీలించారు. ఆదేవిధంగా శ్వేత భవనంలో గల కేంద్రీయ గ్రంథాలయం మరియు పరిశోధనా కేంద్రం, ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు, ద్రవిడ వేద నాళాయిర దివ్యప్రబంధ పారాయణ పథకం, పురాణ ఇతిహాస ప్రాజెక్టు,  శ్రీనివాస తెలుగు వాఙ్మయ అధ్యయన సంస్థ, దాస సాహిత్య ప్రాజెక్టు, శ్రీనివాస కల్యాణం మరియు ఎస్వీ వైభవోత్సవం ప్రాజెక్టులను తనిఖీ చేశారు. ఆయా కార్యాలయాల్లో కోవిడ్-19 నేపథ్యంలో అనుసరిస్తున్న విధి విధానాలను పరిశీలించి ప‌లు సూచ‌న‌లు చేశారు.  జెఈఓ వెంట ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆచార్య రాజగోపాలన్, దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి  ఆనందతీర్థాచార్యులు, శ్వేత సంచాల‌కులు డా. కె.రామాంజుల‌రెడ్డి తదితరులు ఉన్నారు.