జర్నలిస్టుల కుటుంబాలకు గంట్ల దీపావళి శుభాకాంక్షలు..


Ens Balu
3
Visakhapatnam
2020-11-13 20:28:50

ఆంధ్రప్రదేశ్ లోని జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులకు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. విశాఖలో  శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జర్నలిస్టులందరూ సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. దీపాల పండుగ దీపావళి సరికొత్త కాంతులను ప్రసరించి చీకటిని పారద్రోలి సరికొత్త కాంతుల జీవితాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. దీపావళి వెలుగులలో కరోనా వైరస్ రక్కసి పూర్తిగా నశించి దేశంలోనూ ఇటు  రాష్ట్రంలోనూ నూతన అధ్యయనం ప్రారంభం కావాలని గంట్ల ఆశించారు. కరోనా వ్యాప్తి నివారణకు మాస్కే రక్షణ కవచం అని ప్రతి ఒక్క జర్నలిస్టూ గుర్తెరగాలని కోరారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు, చైతన్యాన్ని జర్నలిస్టులు పెద్ద ఎత్తున సహకరించారని, వచ్చే మూడు నెలల కాలంపాటు అదే సహకారం కొనసాగించి కరోనా రహిత రాష్ట్రంగా చేయుటకు నాంది పలుకుదామని పిలుపునిచ్చారు. మాస్కు ధారణ, భౌతిక దూరం పాటించడం, చేతులను తరచూ సబ్బుతోగాని, శానిటైజర్ తోగాని శుభ్రపరచుకోవడం అనే మూడు ప్రాథమిక సూత్రాలను పాటిద్దామని గంట్ల పేర్కొన్నారు. వ్యక్తిగత అనారోగ్యానికి గురికావద్దని, అదే సమయంలో కుటుంబంలో ఉన్న అమ్మ, నాన్న, అన్నయ్య, తమ్ముడు, చెల్లి, అక్క, తాత, అమ్మమ్మ, నాన్నమ్మలకు కరోనా సోకకుండా ఆలోచించాల్సిన బాధ్యత ఉందని అన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుందాం ... దీపావళి కాంతుల్లో కరోనాను మట్టికరిపిద్దాం .... సరి కొత్త అధ్యయనానికి నాంది పలుకుదామని గంట్లశ్రీనుబాబు పిలుపునిచ్చారు.