శ్రీసిటీని సందర్శించిన తుడా చైర్మన్..


Ens Balu
2
Tirupati
2020-11-16 18:34:54

తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) చైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సోమవారం శ్రీసిటీని సందర్శించారు.   ఈ సందర్భంగా సంస్థ  మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు సాదర స్వాగతం పలికి, సిటీ పారిశ్రామిక ప్రగతి, ప్రత్యేకతలు, మౌళిక సదుపాయాలు, ఉద్యోగాల కల్పన గురించి చైర్మన్ కు వివరించారు. శ్రీసిటీ ప్రణాళిక, అభివృద్ధి పట్ల భాస్కర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానికులకు, ముఖ్యంగా మహిళలకు తగినన్ని ఉద్యోగాలు కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలను అభినందించారు. వెనుకబడిన ప్రాంతాన్ని మోడల్ ఇండస్ట్రియల్ పార్కుగా మార్చడంలో శ్రీసిటీ యాజమాన్యం కృషిని ప్రశంసిస్తూ, ఈ ప్రాజెక్టుకు అన్ని విధాలా సహకరిస్తానని హామీ ఇచ్చారు. స్థానికులకు మరిన్ని ఉద్యోగాల కల్పన దిశగా ముందుకు సాగాలని యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. పర్యటనలో భాగంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శ్రీసిటీ పరిసరాలను చుట్టిచూసి పారిశ్రామిక కార్యకలాపాలను పరిశీలించారు. ఎవర్టన్ టీ పరిశ్రమను సందర్శించి, అక్కడ కార్మికులతో చర్చించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శ్రీసిటీ సందర్శన పట్ల శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.  ఈ పర్యటన ఈ ప్రాంత అభివృద్ధి పనులను పర్యవేక్షించడంలో ఆయనకు వున్న శ్రద్ధ, ఆసక్తిని తెలియచేస్తుంది చెవిరెడ్డి పేర్కొన్నారు.