అనంతలో రేపు కరోనా పరీక్షలు చేసేదిక్కడే..


Ens Balu
2
Anantapur
2020-11-16 19:56:16

అనంతపురము జిల్లాలో రేపు (17.11.2020)  కోవిడ్ నమూనాలు సేకరించే ప్రాంతాలను కలెక్టర్ గంధం చంద్రుడు మీడియాకి వివరించారు. ఆయా కేంద్రాల ద్వారా కరోనా లక్షణాలు ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇక ఆ కరోనా పరీక్షలు కేంద్రాలు వివరాలు తెలుసుకుంటే..1. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, అనంతపురం, 2. హమాలీ కాలనీ యూపిహెచ్ సి, 3. మారుతీ నగర్ (మంగలవారి వీధి) యూపిహెచ్ సి, 4. నాయక్ నగర్ యూపిహెచ్ సి, 5. నీరుగంటి వీధి యూపిహెచ్ సి, 6. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్, 7. పెనుకొండ డివిజన్, 8. కదిరి డివిజన్, 9. అనంతపురం డివిజన్,10. కళ్యాణదుర్గం డివిజన్,11. ధర్మవరం ఇలా ప్రకటించిన డివిజన్ లలో పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన మాస్కుధారణ, సామాజిక దూరం పాటిస్తూనే, తరచుగా సబ్బుతో చేతులు కడుక్కోవడం చేయాలన్నారు. అదేసమయంలో కరోనా భారిన పడిన వారు ప్రభుత్వ వైద్యుల పర్యవేక్షణలో 14 రోజులు ఐసోలేషన్ ఉండి బలవర్ధక ఆహారం తీసుకోవాలని కలెక్టర్ గంధం చంద్రుడు సూచిస్తున్నారు.