సృజనాత్మక ఆలోచన అవసరం


Ens Balu
2
Srikakulam
2020-11-17 20:30:27

విద్యార్థులలో సృజనాత్మక ఆలోచన అవసరమని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. కరోనా భారీన పడకుండా వినూత్న ప్రయోగం చేసి డిజిటల్ ఐడి కార్డును శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని  దుప్పలవలస ఏపిబాలయోగి గురుకుల విద్యార్ధులు  రూపొందించారు. ఈ కార్డును తయారు చేసిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ నివాస్ మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో అభినందించారు. భౌతిక దూరం పాటించడం ద్వార వైరస్‌ మహామ్మారిని కట్టడి చేసేందుకు పాఠశాలలో ఏర్పాటు చేసిన అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌లో పరికరాలు వినియోగించి డిజిటల్ ఐడి కార్డు ను రూపొందించారు. టెక్నికల్ ట్రైనర్ శివ సంతోషకుమార్‌ పాణిగ్రాహి విద్యార్థుల మెదడుకు పదును పెట్టి  తక్కువ ఖర్చుతో ప్రత్యేక యంత్రాన్ని రూపొందించారు. తేలికపాటి బరువుతో నిత్యం మెడలో వేసుకునేలా డిజిట్‌ ఐడి కార్డును  ఆ పాఠశాలలో 9వతరగతి చదువుతున్న యాగాటి యశ్వంత్‌ , పెయ్యల గిరి  సహాకారంతో దీన్ని తయారు చేశారు. ఐడి కార్డుకు సరిపడే ఎల్‌ సిడి, డిఎస్‌ ప్లే, దూరం గుర్తించేందుకు అల్ట్రాన్‌  సోనిక్‌ సెన్సర్‌ ‌, శబ్దం వచ్చేందుకు బ్యాటరీ , బజర్‌, ఎల్‌ ఇడిలను పాణిగ్రాహి  వినియోగించారు. సరికొత్త టెక్నాలజీని రూపొందేంచే  ఈకార్డు తయారీకి 200 రూపాయలు వినియోగించుకుని తయారు చేసారు.  ఆరు అడుగుల దూరం కన్నా దగ్గరకి ఎవరైనా వస్తే ఈ ఐడికార్డులో ఉన్న సెన్సార్‌ దాన్ని గుర్తించి అలారం మోగుతుంది. డిజిటల్‌ కార్డులో ఉన్న ఎరుపు రంగు విద్యుత్ బల్బు వెలిగి వారిని హెచ్చరించేలా ఆటో మెటిక్‌గా మోగేలా ఏర్పాటు చేశారు.  మెజరింగ్‌ ఐడీకార్డుగా నామ కరణం చేశారు. అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ లో ఉన్న పరికరాలతోనే డిజిటల్‌ మెజరింగ్‌ ఐడీకార్డులు విద్యార్ధుల రూపొందించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కరోనా వేళ విద్యార్ధులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఒక్కోకార్డుకు రెండు వందల రూపాయలు ఖర్చుకాగా దీని భారం తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని, మరింత టెక్నాలజీ వినియోగించి డిజిటల్‌ కార్డు సైజ్ ను తగ్గించి తయారు చేయవచ్చుని  శివసంతోష్ కుమార్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుకులం జిల్లా సమన్వయ అధికారి వై.యశోదా లక్ష్మీ, ప్రిన్సిపాల్ డి.దేవేంద్ర రావు, సూపరింటెండెంట్ పి.చంద్రయ్య, కె.వసంత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.