నిర్ధిష్ట కార్యాచరణతో పని చేయాలి..


Ens Balu
2
Srikakulam
2020-11-17 20:47:20

రైతు కుటుంబాలను ఆదుకోవడానికి నిర్దుష్ట కార్యాచరణ ప్రణాళికతో పని చేయాలని వ్యవసాయాధికారులకు జిల్లా కలెక్టర్ జె.నివాస్  తెలిపారు.  మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో విత్తనాల పంపిణీ, రైతు భరోసా కేంద్రాల నిర్వహణ, ఈ క్రాప్ నమోదు, ధాన్యం కొనుగోలు, తదితర అంశాలపై సమావేశాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతు కుటుంబాలను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా, సున్నా వడ్డీ రుణాలు వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు.. కరోనా సమయంలో చాలా కష్టం అనుభవించారని, వారిని  ఆదుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.    రబీలో అవసరమైన విత్తనాలు సరఫరా చేయాలన్నారు.  వేరుశనగ, మినుగులు, పెసలు, రాగులు వంటి విత్తనాల సరఫరాపై సమీక్షించారు. మండలవారీగా రైతులతో సమావేశాలు నిర్వహించి వారికి అవసరమైన విత్తనాల వివరాలను తెలుసుకుని సరఫరా చేయాలన్నారు.  గ్రామ సచివాలయాలలో సంక్షేమ పథకాల వివరాలతో పాటు లబ్దిదారుల వివరాలను ప్రదర్శించాలని, అదే విధంగా రైతు భరోసా కేంద్రాలలో సున్నా వడ్డీ రుణాలు, రైతు భరోసా  వివరాలు, ఇ-క్రాపింగ్ నమోదు వివరాలను తప్పని సరిగా ప్రదర్శించాలని చెప్పారు.  ఆర్.బి.కె.లలో కియోస్కులు సరిగా పనిచేయాలని అన్ని ఆర్.బి.కె.లలోను కియోస్కులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆర్.బి.కె.లను సక్రమంగా నిర్వహించాలని,  వ్యనసాయాధికారులు ఆర్.బి.కె.లను సందర్శించాలని తెలిపారు.   శతశాతం ఈ క్రాప్ పూర్తి కావాలన్నారు. రైతు భరోసా కేంద్రాలలో రైతులు రిజిస్టర్ కావాలన్నారు.  ధాన్యం కొనుగోలు కేంద్రాలను డిశంబరు మొదటి వారం నాటికి సిధ్ధం చేయాలన్నారు.   తేమ శాతాన్ని పరీక్షించే యంత్రాలు, అవసరమైన పరికరాలతో  సిద్ధం గా ఉంచాలన్నారు.  ధాన్యం నిలువకు కావలసిన కెపాసిటీని పెంచడం జరిగుందన్నారు.  ఒరిస్సా నుండి ధాన్యం రాకుండా అవసరమైన  చర్యలు తీసుకున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోలుకు కావలసిన అన్ని చర్యలతో ముందుగా నే కొనుగోలు కేంద్రాలను సిధ్ధం చాయాలన్నారు.  అనంతరం, సంయుక్త కలెక్టర్ సుమీత్ కుమార్ మాట్లాడుతూ, స్వఛ్ఛంద సంస్థలకు  కొన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణను అప్పగించడం జరిగిందని తెలిపారు. వారి పరిధిలోని కేంద్రాలకు అవసరమైన సామగ్రిని, పరికరాలను అందిస్తామని  వాటిని సక్రమంగా నిర్వహించాలని  జె.సి. తెలిపారు.  ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్,  సివిల్ సప్లైస్ జిల్లా మేనేజరు ఎ.కృష్ణారావు, విత్తనాభివృధి సంస్థ జిల్లా మేనేజర్,  పి.సి.సి. ఇన్-ఛార్జ్ లు, ఎ.డి.ఎ.లు, ఏ.ఓ.లు, వెలుగు పి.ఎ.సి.ఎస్.లు, ఎఫ్.పి.ఓ.లు, స్వఛ్ఛంద డైరక్టర్లు ఎం.ప్రసాదరావు, భూదేవి, కైలాష్ తదితరులు హాజరైనారు.