20 నుంచి చదువంటే మాకిష్టం..
Ens Balu
1
Srikakulam
2020-11-17 20:57:22
చదవడం మాకు ఇష్టం కార్యక్రమాన్ని ఈ నెల 20వ తేదీన ప్రారంభించడం జరుగుతుందని జిల్లా విద్యా శాఖ అధికారి కె.చంద్రకళ తెలిపారు. విధ్యార్ధుల్లో పాఠశాల స్థాయిలోనే పఠనాశక్తిని పెంపొందించే లక్ష్యాంతో విధ్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించిందని జిల్లా విద్యా శాఖ అధికారి తెలిపారు. బాలల దినోత్సవం సందర్భంగా చదవడం మాకు ఇష్టం కార్యక్రమాన్ని విద్యా శాఖ ప్రవేశ పెట్టిందని చెప్పారు. ఈ మేరకు కార్యక్రమం అమలుపై సమగ్ర శిక్షా అభియాన్ అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ పి.వి.రమణ, ఉప విద్యా శాఖ అధికారి పగడాలమ్మలతో మంగళ వారం జిల్లా విద్యా శాఖ అధికారి కార్యాలయంలో చర్చించారు. వచ్చే ఏడాది నవంబరు 1వ తేదీ నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో 3 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విధ్యార్ధుల్లో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించాలన్నది కార్యక్రమం లక్ష్యమని ఆమె వివరించారు. జిల్లాలో గల ప్రభుత్వ అధీనంలోగల అన్ని పాఠశాలల్లో 3 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విధ్యార్ధులకు ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా చదవడం మాకు ఇష్టం (వుయ్ లవ్ రీడింగు) కార్యక్రమాన్ని విధ్యాశాఖ అధికారులు ప్రారంభిస్తున్నారని తెలిపారు. గ్రామ స్థాయిలో ప్రధానోపాధాయ్యులు, మండల స్థాయిలో ఎంఈఓలు పర్యవేక్షిస్తారని చెప్పారు. స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తమ క్లస్టర్ పాఠశాలల్లో ఆమలయ్యేలా చర్యలు చేపడతారని ఆమె పేర్కొన్నారు.
తరగతి వారీగా గ్రంధాలయ నిర్వహణ :చదవడం మాకు ఇష్టం కార్యక్రమంలో భాగంగా విధ్యార్ధుల స్థాయిలకు అనుగుణంగా సంబందిత ఉపాధ్యాయులు కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేస్తారని డి.ఇ.ఓ చెప్పారు. విధ్యార్ధులు అందరూ తెలుగు, ఇంగ్లీషు చదవగలిగేలా ప్రత్యేక తర్ఫీదునివ్వాలని, గ్రామ, మండల కమిటీ సభ్యులు చర్చించుకొని కార్యాచరణ రూపొందించింది ఆమలు చేయాలని ఆమె సూచించారు. తరగతి ఉపాధ్యాయుడు ఆ తరగతి విధ్యార్ధులకు లైబ్రేరియన్ గా వ్యవహరిస్తారని, గ్రంధాలయంలో పుస్తకాల నమోదు, పుస్తక నిర్వహణ తరగతి వారీగా ఉండాలని వాటి బాధ్యత ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలకు అప్పగించాలని పేర్కొన్నారు. వారంలో ప్రతి శుక్రవారం సాయంత్రం విధ్యార్ధులకు పుస్తకాలు ఇచ్చి శని, ఆదివారాలలో ఇంటి వద్ద చదువుకొనేందుకు అవకాశం కల్పించాలని మార్గదర్శకాలు ఉన్నాయని చెప్పారు.
చదివించాల్సిన పుస్తకాలు : పాఠశాలల్లో ఇప్పటికే సేకరించిన వివిధ పుస్తకాలను ఉపాధ్యాయులు చదివించాలని, తరగతుల వారీగా ఏర్పాటు చేసుకున్న గ్రంధాలయంలో విద్యార్ధులు పఠించుటకు ప్రతిరోజూ రెండు గ్రంథాలయ పిరియడ్లను కేటాయించాలని అన్నారు. సామాజిక పఠనా కేంద్రాలు (కమ్యూనిటి రీడింగ్ సెంటర్స్) ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కథలు, పత్రికలు, ప్రముఖ వ్యక్తుల జీవిత చరిత్రలు, వైజ్ఞానిక విశేషాల పుస్తకాలకు ప్రాధాన్యమివ్వలని ఆమె పేర్కొన్నారు. విధ్యార్ధులను ఆకర్షించే కార్యక్రమాల్లో భాగంగా పుస్తక నేస్తం, పఠన ఉత్సవాలు, పఠన మేళాలు, గ్రామ కథా వేదిక వంటి కార్యక్రమాలు నిర్వహించాలని డి.ఇ.ఓ తెలిపారు.