శ్రీముఖలింగంలో గోత్రనామాల ఉచ్ఛారణ..


Ens Balu
2
Srikakulam
2020-11-17 20:59:57

కార్తీక మహోత్సవాలలో భాగంగా శ్రీ వరాహి సహిత ముఖలింగేశ్వర స్వామి ఆలయంలో ఉచితంగా గోత్రనామాలను జపించుటకు నిర్ణయించామని ఆలయ ప్రధాన అర్చకులు నాయుడుగారి రాజశేఖర్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ కోవిడ్ కారణంగా భక్తులు స్వామి వారి దర్శనానికి వచ్చే అవకాశం లేనందున ఈ ఏర్పాటు చేసామని పేర్కొన్నారు. కార్తీక మాస ఉత్సవాలలో 108 పాదాలుగా గల జన్మ నక్షత్ర దోషాలు పోవడానికి గోత్ర నామాలు, కుటుంబ సభ్యుల పేర్లు పూజలో ఉచ్ఛరిస్తామని తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు రాజశేఖర్  వాట్సాప్ 9493577098 నంబరుకు గోత్ర నామాలు, పేర్లు పంపించవచ్చని ఆయన పేర్కొన్నారు. దీనిని పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తామని, ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని, భక్తుల సౌకర్యార్ధం ఏర్పాటు చేసామని ఆయన వివరించారు. భక్తులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.