విశాఖలో త్వరలో టిడ్కో ఇళ్లు పంపిణీ..
Ens Balu
2
జివిఎ:సీ కార్యాలయం
2020-11-17 21:04:29
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా అర్హత కలిగిన లభ్దిదారులకు ఏ.పి. టిడ్కో సంస్థ ద్వారా నిర్మిస్తున్న 24వేల గృహాలను మంజూరు చేయడానికి సిద్ధంగా ఉండాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె, జివిఎంసి సమావేశ మందిరంలో అదనపు కమిషనర్ ఆషాజ్యోతితో కలసి యు.సి.డి. పధక సంచాలకులు, అందరు జోనల్ కమిషనర్లు, ఏ.పి.డి.లు, ఏ.పి. టిడ్కో సంస్థ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ, ముందుగా అనర్హులైన వ్యక్తులకు తిరిగి చెల్లించవలసిన సొమ్ము గూర్చి జాబితా సిద్ధం చేయాలన్నారు. టిడ్కో ప్రాజెక్టులో నిర్మితమౌతున్న వివిధ కేటగిరీల గృహాలను మంజూరు చేయుటకు గాను తగు అర్హత కలిగిన లబ్దిదారుల జాబితాను సిద్ధం చేయాలని జోనల్ కమిషనర్లును ఆదేశించారు. గృహాలు మంజూరు చేసి లబ్దిదారులకు బ్యాంకు ఋణం మంజూరు చేయించుటకుగాను తగు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ ఆషాజ్యోతి, యు.సి.డి. పధక సంచాలకులు వై. శ్రీనివాస రావు, అందరు జోనల్ కమిషనర్లు, ఏ.పి.డి.లు, ఏ.పి. టిడ్కో సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు.