స్మార్ట్ సిటీ ప్రాజెక్టుతో విశాఖ మరింత సుందరం..
Ens Balu
4
Visakhapatnam
2020-11-17 21:24:19
స్మార్ట్ విశాఖ పనులతో నగరం మరింత సుందరం కానుందని వి.ఎం.ఆర్.డి.ఏ. కమిషనర్ కోటేశ్వరరావు, జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన అన్నారు. మంగళవారం రాత్రి కార్పోరేషన్ ఇంజినీరింగ్ అధికారులతో కలసి మంగళవారం పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. పార్కులో కొనసాగుతున్న పనులను మూడు కేటగిరిలుగా విభజించి పరిశీలన చేసి ఇంజినీరింగు అధికారులకు పలు సూచనలు చేసారు. నడక దారి, ప్లాంటేషన్, గ్రీనరీ పనులు, సైకిల్ ట్రాకు, బోటింగు పూల్ ఏరియా, వాలీ బాల్, టేన్నీసు కోర్టుల పనులను నిశితంగా పరిశీలించారు. పార్కులో సోలార్ ట్రీని మరియు సోలార్ బెంచీలు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పార్కు లోపల వాహనాల పార్కింగు ఏర్పాటు చేయమని సూచించారు. ముఖ్యంగా పార్కు ప్రధాన గేటు వద్ద సుందరమైన ఆర్చ్ ను తీర్చి దిద్దాల్సిందిగా ఆదేశించారు. పార్కు అభివృద్ధి పనులను డిశంబరు నెలాఖరు నాటికి పూర్తీ చేయాలని సంబందిత కాంట్రాక్టరు ను ఆదేశించారు. ఈ పర్యటనలో కార్పోరేషన్ ప్రధాన ఇంజినీరు ఎం. వెంకటేశ్వర రావు, పర్యవేక్షక ఇంజినీరు వినయ కుమార్, కార్యనిర్వాహక ఇంజినీరు సుధాకర్, పి.ఎం.సి. ప్రతినిధులు, గుత్తేదారు మొదలగువారు పాల్గొన్నారు.