స్వచ్ఛసర్వేక్షణ్ లో మంచి స్థానం సంపాదించాలి..
Ens Balu
3
Visakhapatnam
2020-11-17 22:03:03
స్వచ్ఛ సర్వేక్షణ్-2021 పోటీలలో విశాఖ నగరానికి ఉత్తమ స్థానం తీసుకు రావడానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన పిలుపునిచ్చారు. మంగళవారం జీవిఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజారోగ్య అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, స్వచ్ఛ సర్వేక్షణ్ – 2020లో జరిగిన కొన్ని పొరపాట్లను సరిదిద్దుకొని ముందుకు సాగాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ -2021లో ఉత్తమ ర్యాంకు పొందాలంటే కింద స్థాయి అధికారులనుండి పై స్థాయి అధికారి వరకు బాగా కృషి చేయాలని స్వచ్ఛతా యాప్ ఉపయోగించాలని, ప్రజలను చైతన్యవంతులు చేసి ఫీడ్ బ్యాకులు పెంచాలన్నారు. డోర్ టు డోర్ చెత్త కలక్షన్ చేయాలని, గృహాల నుండి చెత్త పద్దతిగా ఇవ్వకపొతే వారికి గృహాల వద్ద పూర్తీ అవగాహన కల్పించాలన్నారు. కాలేజిలలోను, ఆర్.డబ్ల్యూ.ఏ. తోను సమావేశాలు నిర్వహించి, స్వచ్ఛతపై అవగాహన పెంచాలన్నారు. హోమ్ కంపోష్ట్ ల తయారీకి, మహిళా గ్రూపులను ప్రోత్సహించాలన్నారు. బిన్స్ పూర్తిగా నిండకుండా చూడాలన్నారు. ముఖ్యంగా బిన్ ఫ్రీ సిటీగా డిశంబరు ఒకటవ తేది నుండి ప్రారంభించడానికి తగు చర్యలు చేపట్టాలన్నారు. దసపల్లా లే అవుట్లో చెత్త తరలించినప్పటికీ మరల చెత్త వేస్తున్నారని, చెత్త వేయకుండా చూడాలన్నారు. ఇంకా బహిరంగ మల మూత్ర విసర్జన అక్కడక్కడ ఉన్నందున అక్కడ ప్రజలను చైతన్యవంతులను చేసి మరుగుదోడ్డ్లు ఉపయోగించేలా చూడాలన్నారు. ప్లాస్టిక్ వినియోగం, మూత్ర విసర్జన మొదలగువాటిపై జరిమానా విధించాచాలన్నారు. చెత్త తరలించే వాహనాలు ఉదయం 6.30 కు ఎం.ఎస్.ఎఫ్. కు వచ్చేలా చర్యలు తీసుకోవాలని, వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని కార్యనిర్వాహక ఇంజినీరును ఆదేశించారు. చెత్త తరలింపు విషయంలో ఎక్కడ అలసత్వం ఉండకూడదన్నారు. మెకానికల్ ఇంజినీరింగు అధికారులు కూడా ఉదయం పూట క్షేత్ర పర్యటనలు నిర్వహించి, గ్రూపులో ఫోటోలు పెట్టాలన్నారు. ప్రతీ జోన్ లో చెత్త నిర్వహణకు ఉపయోగిస్తున్న ప్రైవేటు వాహనాలకు తగు నియంత్రణ చేయాలని వాటి నిర్వహణ పై తగు దృష్టి సారించి అవి ప్రతీ రోజూ విధులలో ఉండే విధంగా చూడాలని, ఒక వేల వాహనం ఆగిపోతే సంబందిత కాంట్రాక్టరు బాధ్యతా వహించి వాటికి బదులు వేరొక వాహనాన్ని పంపించేలా చూసే బాధ్యతా కార్యనిర్వాక ఇంజినీరు(మెకానికల్) వారిదేనని స్పష్టం చేసారు. కార్యనిర్వాక ఇంజినీరు(మెకానికల్) వారు అందరు కాంట్రాక్టర్లతోను, మెకానికల్ సహాయక ఇంజినీర్లతోను ఒక సమావేశం ఏర్పాటు చేసి ప్రైవేటు వాహనములను ఒక క్రమ పద్దతిలో నడిచేటట్లు ప్రణాళిక తయారు చేసి చూపెట్టాలని కార్యనిర్వాక ఇంజినీరు(మెకానికల్) ను ఆదేశించారు. వివిధ కార్మిక యూనియన్లకు అనుమతించిన సంఖ్య కన్నా ఎక్కువగా వినియోగిస్తే వారిని విధులలో లేనట్లుగా పరిగణించాలని అందరికి ఆదేశించారు. రిపేర్లు చేయవలసిన చెత్త తోపుడు బళ్లను (పుష్ కార్ట్ లు) ఈ వారంలోగా రిపేరు చేయాలని, మెకానికల్ విభాగం వారికి ఆదేశించారు. చెత్తను రవాణా చేసే వాహనాలకు రిపేర్లు వస్తే వాటిని అక్కడికక్కడే రిపేరు చేయించే విధంగా దూరపు జోన్లు అయిన గాజువాక, అనకాపల్లి, భీమిలిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మెకానికల్ ఇంజినీరును ఆదేశించారు. ఖాళీగా ఉన్న ఒప్పంద పారిశుద్ధ్య కార్మీకుల స్థానంలో, వారి బంధువుల ఎవ్వర్నీ తీసుకోవద్దని సి.ఎం.ఓ.హెచ్.ని ఆదేశించారు. వచ్చే సమావేశంలో సంబందిత జోనల్ కమిషనర్లు పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా స్వచ్ఛ సర్వేక్షణ్ పై తీసుకున్న చర్యలు గురించి వివరించాలన్నారు.ఈ సమావేశంలో అదనపు కమిషనర్ డా.వి. సన్యాసి రావు, సి.ఎం.ఓ.హెచ్. డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, బయాలజిస్ట్ పైడి రాజు, అందరు జోనల్ కమిషనర్లు, ఏ.ఎం.ఓ.హెచ్.లు, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్ స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.