జిల్లా కలెక్టర్‌కు ఆర్‌టిఏ అధికారుల సన్మానం..
Ens Balu
1
Vizianagaram
2020-11-17 22:06:59
విజయనగరం జిల్లా జల సంరక్షణలో జిల్లాకు జాతీయ అవార్డును సాధించిపెట్టిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ కు అభినందనలు వెళ్లువెత్తుతున్నాయి. జిల్లా రవాణాశాఖ అధికారులు కలెక్టర్‌ను మంగళవారం సన్మానించారు. డిప్యుటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ సిహెచ్. శ్రీదేవి ఆధ్వర్యంలో దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు జె.రామ్‌కుమార్, ఎం.బుచ్చిరాజుతోపాటు లీలాప్రసాద్, జెవిఎస్ఎస్ ప్రసాద్, ఎఎంవిఐలు ఎండి బషీర్, యు.దుర్గాప్రసాద్, కె.పార్వతి, పి.శిరీష, కాశీరామ్‌నాయక్, సిబ్బంది పాల్గొన్నారు. గురజాడ సాంస్కృతిక సమాఖ్య తరపున కె.ప్రకాష్, డాక్టర్ ఏ.గోపాలరావు మాష్టారు జిల్లా కలెక్టర్ ను శాలువతో సన్మానించారు. అలాగే పద్మనాభం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లోని ట్రెజరీ సిబ్బంది సైతం కలెక్టర్‌ను సత్కరించారు.