సర్వీసు రిక్వెస్టులు పెరిగిలా చైతన్యం తేవాలి..


Ens Balu
1
Parvathipuram
2020-11-17 22:39:51

ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న అభివృధి, సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు స‌చివాల‌యాల ద్వారా మెరుగైన, స‌త్వ‌ర సేవ‌లందించ‌డం ద్వారా గ్రామాల్లోనే త‌మకు ప్ర‌భుత్వ సేవ‌లు అందుతాయ‌న్న నమ్మకం ప్ర‌జ‌ల్లో క‌ల్పించాల‌ని  స‌చివాల‌య సిబ్బందికి సూచించారు. ప్రాజెక్ట్ అధికారి తన పర్యటనలో భాగంగా మంగళవారం పార్వతీపురం జగన్నాధపురం 1, స‌చివాల‌యాన్ని ఆయ‌న  ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా గ్రామ స‌చివాల‌యం ద్వారా అందిస్తున్న సేవ‌ల‌పై ఆరా తీశారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల స‌మాచారాన్ని స‌చివాల‌యంలో గోడ‌ల‌పై ప్ర‌ద‌ర్శించిన‌ది, లేనిది ప‌రిశీలించారు. సంక్షేమ ప‌థ‌కాల కోసం అందే విన‌తుల ప‌రిష్కారం నిమిత్తం చేప‌ట్టిన చ‌ర్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. ఇ-రిక్వెస్టుల ప‌రిష్కారంపై ఆరా తీశారు. స‌చివాల‌య ఉద్యోగుల హాజ‌రు ప‌ట్టీల‌ను ప‌రిశీలించి సిబ్బంది అంతా ప్ర‌తిరోజు విధుల‌కు హాజ‌రవుతున్న‌ది, లేనిది తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ స‌చివాల‌యాల‌కు మంచి పేరు తీసుకురావ‌డ‌మ‌నేది సిబ్బంది చేతుల్లోనే ఉంద‌ని,  ప్ర‌జ‌ల‌కు చేరువ‌గా ఉంటూ వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి నిత్యం కృషిచేయాల‌ని సూచించారు.   అనంతరం పెడబొండపల్లి  జిల్లా పరిషత్ హైస్కూల్లో  చేపడుతున్న నాడు నేడు పనులు,  పరిశీలించి సంబంధిత ఆధికారులతొ మాట్లాడుతూ నిర్మాణ పనులు పూర్తి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు వేగవంతం చేయాలని, సంబంధిత అధికారులకు సూచించారు.  ఈ పర్యటనలో ట్రైబల్ వెల్ఫేర్ ఎ.ఇ, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.