నిరుపేదల సేవలోనే ఆత్మసంతృప్తి..


Ens Balu
1
Visakhapatnam
2020-11-18 14:51:07

నిరుపేదలకు వారు కోరుకున్న విధంగా సేవలు అందించడం లోనే పూర్తిస్థాయిలో ఆత్మ సంతృప్తి కలుగుతుందని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పక్కి దివాకర్ అన్నారు. బుధవారం  వివేకానంద అనాధ వృద్ధాశ్రమంలో పైలా శివతేజ  చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  శివతేజ జయంతి వేడుకలు వారి కుటుంబ సభ్యులు  సన్నిహితులు పలు సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. ఈ సందర్భంగా పక్కి దివాకర్ మాట్లాడుతూ, నిరుపేదల కోసం వివేకానంద సంస్థ చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. కోవిడ్  లో సైతం ఈ సంస్థ ఎనలేని విధంగా సేవలందించింది అని కొనియాడారు. కార్యక్రమ నిర్వాహకులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, ప్రతి ఏటా శివతేజ జయంతి వేడుకలను చారిటబుల్ ట్రస్ట్ ద్వారా  వారి కుటుంబ సభ్యులు సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. శివతేజ  జయంతి, వర్ధంతి సందర్భంగా నగరంలోని అనేక వృద్ధాశ్రమాలలో వారి కుటుంబ సభ్యులు సేవలందిస్తున్నారని ఎంతో మందికి వారికి తోచిన రీతిలో సహాయం చేస్తున్నట్లు చెప్పారు. నగరం లోనిప్రేమ సమాజంతో పాటు  అనేక ఆశ్రమాలకు  శివతేజ తండ్రి పైల దివాకర్ రావు విరాళాలు అందిస్తున్న ఆదర్శనీయమన్నారు. తాజాగా శివతేజ జయంతిని  పురస్కరించుకుని వివేకానంద వృద్ధాశ్రమంలో అతిధుల చేతులమీదుగా అన్నదానం, వస్త్రదానం కార్యక్రమాన్ని ఘనంగా  నిర్వహించారు. చలి కాలం నేపథ్యంలో వృద్ధులు కు రగ్గులు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఫౌండర్ పైల దివాకర్ వివేకానంద సంస్థ అధ్యక్షులు సూరాడ అప్పారావు, ఇరోతి ఈశ్వర్ రావు, పీతల మూర్తి యాదవ్ తో పాటు పలువురు పాల్గొని తమ వంతు సేవలు అందించారు. అంతకుముందు,  శివ తేజ ఫౌండేషన్ ఆధ్వర్యంలో న్యూ కాలనీ సాయి బాబా ఆలయం నుంచి రైల్వే స్టేషన్ వరకు అన్నార్థులకు అల్పాహారం ను దివాకర్ కుటుంబ సభ్యులు  పంపిణీ చేసారు..