శారధాపీఠాధిపతి మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలి..
Ens Balu
2
విశాఖ పాపాహోం
2020-11-18 15:12:37
విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మరిన్ని కాలాలు జీవించి, విశాఖతోపాటు, రాష్ట్రాన్ని శుభిక్షండా ఉండేటట్టు దీవించాలని కోరుకుంటున్నట్టుు ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ అన్నారు. బుధవారం పీఠాధిపతి జన్మదినోత్సవం సందర్భంగా నగరంలోని పోలీస్ బేర్స్ వద్దగల బాలుర పాపా హోమ్ లో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పిల్లలకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎం వి వి సత్యనారాయణ గారు హాజరై పిల్లలకు భోజన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, దైవాంశ సంభూతులు స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదిన వేడుకలు పిల్లల మధ్య జరుపుకోవడం ఆనందంగా వుందన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ వైసీపీ మహిళా ఇన్చార్జ్ పీలా వెంకటలక్ష్మి, పాప హోమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.