పి.త్రిపురకు జెఎన్టీయూకే పీహెచ్డీ..
Ens Balu
2
Kakinada
2020-11-18 16:05:15
జవహర్ లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్శిటీ కాకినాడ ప్రి.త్రిపుర కు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగంలో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీని ప్రధానం చేసింది. ‘ఇన్వెస్టిగేషన్స్ ఆఫ్ ఏసి జనరేటర్స్ ఫర్ విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్స్’’ జెఎన్‌టియుకె అధికారులు ఆమోద ముద్ర వేశారు. ఈమె తన సిద్ధాంత వ్యాసాన్ని తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని జెఎన్‌టియుహెచ్ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్ (యుసిఇహెచ్) ఈఈఈ విభాగం ప్రొఫెసర్ డా.జి.తులసీ రాందాస్ ఆధ్వర్య పర్యవేక్షణలో సమర్పించారు. త్రిపురకు పీహెచ్డీ అవార్డు రావడం పట్ల సన్నిహితులు హర్షం వ్యక్తం చేశారు.