జి.భారతీకి మేనేజ్ మెంట్ స్టడీస్ లో పీహెచ్డీ
Ens Balu
1
Kakinada
2020-11-18 16:10:33
జవహర్ లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్శిటీ కాకినాడ జి.భారతికి మేనేజ్‌మెంట్ స్టడీస్ విభాగంలో పీహెచ్డీ డిగ్రీని ప్రధానం చేసింది. ‘‘ఏ స్టడీ ఆన్ కార్పొరేట్ సోషల్ రెస్సాన్సిబిలిటీ (సిఎస్‌ఆర్) ప్రాక్టీసెస్ ఇన్ ఇండియన్ బ్యాంకింగ్ సెక్టార్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ), హైదరాబాద్ రీజియన్’’ జెఎన్‌టియుకె అధికారులచే ఆమోద ముద్ర పొందినది. జి.భారతి తన సిద్ధాంత వ్యాసాన్ని రాజమండ్రిలోని ఆదికవి నన్నయ యూనివర్శిటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్ మేనేజ్‌మెంట్ ప్రొఫెసర్ డా.టేకి సూరయ్య ఆధ్వర్య పర్యవేక్షణలో సమర్పించారు. భారతికి పీహెచ్డీ అవార్డు రావడం పట్ల సన్నిహితులు హర్షం వ్యక్తం చేశారు.