అనంత ఐసిడిఎస్ పీడీ సరెండర్..
Ens Balu
4
Anantapur
2020-11-18 17:09:34
అనంతపురం జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ చిన్మయీ దేవిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని ముదిగుబ్బ, నల్లమాడ, ఓడి చెరువు, అమడగూరు మండలాల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరా చేయడంలో మెనూను పాటించడం లేదన్న ఆరోపణలపై విచారణ విషయంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ సరైన విధంగా స్పందించకుండా అలసత్వం వహించడం, అంగన్వాడీ పోస్టుల నియామకాలకు సంబంధించి నిబంధనల ప్రకారం ఖాళీలను చూపకుండా తప్పుల తడకలతో నోటిఫికేషన్ జారీ చేయడం, అంతేకాక జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా ఈ నెల 16 వ తేదీ నుండి 15 రోజుల పాటు సెలవులో వెళ్లడంతో ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ చిన్మయీ దేవిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఐసిడిఎస్ పిడి స్థానంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ( గ్రామ, వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి) ఏ.సిరికి ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించినట్లు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు.