PMMSYను సద్వినియోగం చేసుకోండి..
Ens Balu
3
Vizianagaram
2020-11-18 17:28:10
భారత దేశములో సుస్థిర, భాద్యతాయుతమైన మత్స్య అబివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.20050 కోట్లతో 2020-21 సం. నుంచి 2024-25 సం. వరకు 5 సంవత్సరాలలో అమలు పరిచేవిధంగా “ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన” పధకము ప్రవేశపెట్టారని మత్స్య శాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలా కుమారి తెలిపారు. బుధారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఈ పధకములో లబ్దిదారుల కేంద్రంగా పధకాల అమలు నిమిత్తము జిల్లాకు రూ. 4.54 కోట్లను ప్రస్తుత సంవత్సరానికి కేటాయించడమైందన్నారు. ఈ పధకంలోని యూనిట్ ఖరీదులో ఇతర లబ్దిదారులందరకి 40% రాయతీ, షెడ్యూలు కులాల, షెడ్యూలు తెగలు మరియి మహిళా లబ్దిదారులకు సంబందించిన పధకాలలో 60% రాయతీగానూ, లబ్దిదారులు వాటా 40% గాను ఉంటుందని, ఈ పధకం కేంద్ర ప్రయోజక పధకమైనందున రాయతీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఉంటుందన్నారు. దరఖాస్తుదారులు ఆక్వా, మత్స్య రంగమునకు చెందినవారై ఉండాలని, తగు శిక్షణ పొంది, మంచి నైపుణ్యం కలిగిన వారై ఉండాలన్నారు. యూనిట్ల మంజూరు కోసం దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను ఎపిసిఎఫ్ఎస్ఎస్ నవశకం వెబ్ సైట్ నందు సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ ద్వారా ఆన్ లైన్ లో దాఖలు చేసుకోవాలన్నారు. ఫొటోతో కూడిన దరఖాస్తుతో పాటు, వారు కోరు పథకంలోని లబ్ధిదారుల వాటా సొమ్ముకు సంబంధించి బ్యాంకు రుణ మంజూరు పత్రం లేదా బ్యాంకు ఖాతా నందు లబ్ధిదారుని వాటాకు సరిపడు సొమ్ము కలిగియున్న పాసు పుస్తకము, ఇతర అనుమతులు, అవసరమైన పత్రాలు, ప్రాజెక్టు రిపోర్టులు ఆన్ లైనులో అప్ లోడ్ చేయవలసి ఉంటుందన్నారు. ఈ విధముగా అప్ లోడ్ చేయబడిన దరఖాస్తులు వివరములను జిల్లా స్థాయి కమిటీ వారు పరిశీలించి ఎంపిక చేస్తారన్నారు. తగిన పత్రాలు అప్ లోడ్ చేయనిచో దరఖాస్తు వెంటనే తిరస్కరించబడునని, దరఖాస్తుదారులుపైన సూచించిన విధముగా 2020 నవంబరు 20వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవలసినదిగా కోరడమైనది. జిల్లా స్థాయి కమిటీలో ఎంపిక కాబడిన వెంటనే దరఖాస్తుదారులకు జిల్లా మత్స్య శాఖ ఉప సంచాలకులు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తారన్నారు. రూ. 50.00 లక్షలుకు పైబడిన యూనిట్ల మంజూరుకు రాష్ట్ర స్థాయి కమిటీ వారి ఆమోదం పొందవలసి యుంటుందన్నారు. ఈ పధకాలు అన్ని మార్చి 31, 2021 లోపు అమలు కావలసియున్నదని, మరిన్ని వివరాలకు గ్రామ సచివాలయాలును సంప్రదించాలన్నారు.