wjhs కార్డులు రెవిన్యువల్ చేయించుకోవాలి..


Ens Balu
3
Vizianagaram
2020-11-18 17:34:58

విజయనగరం జిల్లాలోని వివిధ పత్రికలు, టీవీలు, ఇతర ప్రసార మాధ్యమాల్లో పని చేస్తున్న జర్నలిస్టుల హెల్త్ కార్డుల పునరుద్ధరణకు సంబంధించి 2020-21 ఆర్థిక సంవత్సరానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు సమాచార పౌరసంబంధాల శాఖ, సహాయ సంచాలకులు డి.రమేశ్ తెలిపారు. అక్రెడిటేషన్ ఉండి అర్హత కలిగిన జర్నలిస్టులు ఈ నెల 30వ తారీఖులోగా ఆన్లైన్లో చలానా కట్టడం ద్వారా అప్లై చేసుకోవాలని చెప్పారు. cfms.ap.gov.in వెబ్సైట్ ద్వారా లాగిన్ అయ్యి హెడ్ ఆఫ్ అకౌంట్- 8342-00-120-01-03-001-001, డీడీవో కోడ్: 2703-0802-003 నంబర్ పై రూ.1250 చెల్లించాలని పేర్కొన్నారు. నగదు చెల్లించిన అనంతరం సంబంధిత చలానాను సమాచార పౌరసంబంధాల శాఖ, విజయనగరం కార్యాలయంలో అందజేయాలన్నారు. ఇదివరకు కార్డుల కలిగినవారు పాత కార్డులను తిరిగి ఇవ్వాలని, తాజాగా అప్లై చేసుకొనేవారు ఒక పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు, నిర్ణీత దరఖాస్తు, అక్రెడిటేషన్ కార్డు నకలు సమాచార పౌరసంబంధాల శాఖ, కార్యాలయంలో విధిగా సమర్పించాలని వివరించారు.