రాష్ట్రపతి పర్యటనపై ఈఓ సమీక్ష..
Ens Balu
2
Tirumala
2020-11-18 17:38:40
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నవంబరు 24వ తేదీ తిరుచానూరు, తిరుమల పర్యటనకు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై బుధవారం సాయంత్రం టీటీడీ ఈఓ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. టీటీడీ పరిపాలన భవనంలో జరిగిన సమీక్షలో రాష్ట్రపతి తిరుచానూరు అమ్మవారి ఆలయం, తిరుమలలో శ్రీ వరాహస్వామి ఆలయం, శ్రీవారి ఆలయంలో దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్ర పతి దర్శనానికి వచ్చిన సమయంలో ప్రొటోకాల్ ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏర్పాట్లు, కోవిడ్-19 నిబంధనల గురించి చర్చించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా, అదనపు ఈఓ ధర్మారెడ్డి, జెఈఓలు బసంత్ కుమార్, సదా భార్గవి, జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మం, సివిఎస్వో గోపీనాథ్ జెట్టి, అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి పాల్గొన్నారు.