పథకాల లక్ష్యాలను పూర్తిచేయాలి..
Ens Balu
1
Visakhapatnam
2020-11-18 17:47:41
ప్రభుత్వ అభివృద్ధి పథకాల అమలు పై ప్రత్యేక దృష్టిపెట్టి యుధ్ధ ప్రాతిపదికన నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హౌసింగ్ కు సంబంధించి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ, గ్రౌండింగ్, ఎంజిఎన్ఆర్ఇజిఎస్ పనులకు సంబంధించి గ్రామ సచివాలయాలు , రైతు భరోసా కేంద్రాలు , వైయస్సార్ హెల్త్ క్లినిక్స్ భవన నిర్మాణ పనులు, చిరు వ్యాపారులకు జగనన్న తోడు, నాడు- నేడు పథకం కింద పాఠశాలలు, అంగన్వాడీ భవనాలలో మౌలిక వసతులు, కాంపౌండ్ వాల్స్ నిర్మాణాలు, కోవిడ్-19, ఖరీఫ్ ప్రొక్యూర్మెంట్, రబీ ప్రిపేర్డ్నేస్ తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్, జాయింట్ కలెక్టర్లు ఎం వేణుగోపాల రెడ్డి , పిఅరుణ్ బాబు, ఆర్ గోవిందరావు, ఐ టి డి ఎ ప్రాజెక్ట్ అధికారి వెంకటేశ్వర్, జీవీఎంసీ కమిషనర్ జి సృజన, జిల్లా అధికారులు హాజరయ్యారు.