ఆన్లైన్ లో టిబి యూనిట్ పోస్టుల మెరిట్ జాబితా..
Ens Balu
2
Srikakulam
2020-11-18 19:07:51
శ్రీకాకుళం జిల్లాలో క్షయ నివారణ కార్యాలయం టి.బి.యూనిట్లలో ఏడాది కాలానికి పనిచేయుటకు ఎంపికైన అభ్యర్ధుల తుది జాబితా ( మెరిట్ లిస్ట్ ) ను www.srikakulam.ap.gov.in వెబ్ సైట్ నందు పొందుపరచడం జరిగిందని జిల్లా క్షయ నివారణ అధికారి డా. యన్.అనూరాధ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసారు. జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు జిల్లా క్షయ నివారణ కార్యాలయం టి.బి.యూనిట్లలో ల్యాబ్ టెక్నిషియన్, టి.బి.హెల్త్ విజిటర్, టి.బి.ల్యాబ్ సూపర్ వైజర్, సీనియర్ టి.బి.ల్యాబ్ సూపర్ వైజర్, సీనియర్ ట్రీట్ మెంట్ సూపర్ వైజర్, ఒక డాట్ ప్లస్ – హెచ్ఐబీ సూపర్ వైజర్ పోస్టులకు ఏడాది కాలానికి పనిచేయుటకు అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరిన సంగతి విదితమే. ఈ పోస్టులకు 811 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగా అభ్యర్ధుల నుండి వచ్చిన గ్రీవెన్స్ లను పరిశీలించిన పిదప రెండు ల్యాబ్ టెక్నిషియన్లు, ఇద్దరు టి.బి.హెల్త్ విజిటర్లు, రెండు సీనియర్ టి.బి.ల్యాబ్ సూపర్ వైజర్లు, ఒక సీనియర్ ట్రీట్ మెంట్ సూపర్ వైజర్, ఒక డాట్ ప్లస్ – హెచ్ఐబీ సూపర్ వైజర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్ధుల తుది జాబితాను ఆన్ లైన్ లో, టి.బి.కార్యాలయం మరియు రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రి రూమ్ నెం.18 నందు పొందుపరచడం జరిగిందని ఆమె వివరించారు.